John Sena : సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో సందడి చేయబోతున్న WWE ఛాంపియన్ జాన్ సీనా..!!

John Sena : WWE ప్రపంచ ఛాంపియన్ జాన్ సీనా సెప్టెంబర్ 8వ తారీకు హైదరాబాద్ లో సందడి చేయనున్నారు. హైదరాబాద్ GMC బాలయోగి స్టేడియంలో జరగనున్న సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ కోసం దాదాపు 17 సంవత్సరాల తర్వాత జాన్ సీనా.. ఇండియాలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటివరకు 16 సార్లు WWE ప్రపంచ ఛాంపియన్ గా జాన్ సీనా టైటిల్ గెలవడం జరిగింది.

WWE Champion John Cena is going to make noise in Hyderabad on September 8

ఈ సందర్భంగా భారతదేశంలో జరగబోయే కుస్తీ పోటీల కోసం.. ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నట్లు రాబోతున్నట్లు జాన్ సీనా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. WWE రెజ్లింగ్ గేమ్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. భారతీయుల సైతం ఈ ఆటని ఎంతగానో ఆస్వాదిస్తారు. భారతదేశం నుండి కాళీ అనే వ్యక్తి కూడా WWE కొన్ని సంవత్సరాల క్రితం పోటీ పడటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉండే ఈ గేమ్ ఎక్కువగా యూరప్ దేశాలలో నిర్వహిస్తారు.

ముఖ్యంగా అమెరికాలో WWE మ్యాచ్ లు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్ నగరం నందు wwe ఈవెంట్ జరుగుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా WWE అభిమానులు భారీ ఎత్తున టికెట్లు కొంటూ ఉన్నారు. దాదాపు మూడు రోజులపాటు ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఇప్పటికే ఈ ఈవెంట్ కి సంబంధించి టికెట్లు అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే జాన్ సీనా.. తాను కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు ఇండియాకి వస్తున్నట్లు ప్రకటన చేయటంతో ఈవెంట్ చూడటానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.