Pavan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం హరిహర వీరమల్లు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. దీని తరువాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్.. అలాగే సముద్ర ఖని డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి కూడా పవన్ ఒక మూవీ చేయనున్నారు.. అయితే వీటికి సంబంధించిన ఓ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

యువ నిర్మాత ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి తో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నారని..అలానే దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని కూడా న్యూస్ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఈ మూవీ హోల్డ్ లో పడిందని..
పవన్ కళ్యాణ్ తో సముద్రఖని మూవీ ఓకే అవ్వడమేనని, ఆ చిత్రానికి పవన్ ఎక్కువగా డేట్స్ ఇచ్చారట. అలాగే హరీష్ శంకర్ సినిమా తో పాటు సముద్ర ఖని సినిమాని పూర్తి చేసిన తరువాతే పవన్ నెక్స్ట్ ప్రాజక్ట్స్ చేస్తారట. ఇక సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి సినిమాలు ప్రస్తుతానికి సైడ్ చేశారట. మరి కొంతమంది ఈ సినిమా పూర్తిగా క్యాన్సిల్ అయినట్టు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన లేదు త్వరలోనే పూర్తి విషయాలు తెలియనున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఇంకా నలభై శాతం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది . ఇందులో రెండు పాటలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. టాకీ మొత్తం అయితేనే టీజర్ విడుదల చేస్తారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమను దసరాకు విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. మే నెల నాటికి టాకీ పూర్తయిపోతుందని కొంచెం ఆలస్యమైనా పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ తీసుకున్నా దసరాకు పక్కా విడుదల పాజిబుల్ అనే ధీమాతో ఉన్నారు.