Sushanth: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజు చనిపోయి మూడేళ్లు అవుతున్న అతని సూసైడ్ కేసు మిస్టరీ వీడలేదు.. ఆయన అభిమానులు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయన పేరుతో ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.. అయితే సుశాంత్ గురించి ఓ విషయాన్ని చెప్పారు దర్శకుడు అనురాగ్ కశ్యప్..

దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ మృతి నిజంగా దురదృష్టకరం. నేను ఎంతో బాధపడ్డాను. సుశాంత్ చనిపోవడానికి సరిగ్గా మూడు వారాల ముందు అతని టీమ్ నుంచి ఓ వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. సుశాంత్ నన్ను కలవాలనుకుంటున్నాడని నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు.
అప్పుడు ఆ మెసేజ్ పంపిన అతనితో నేను మాట్లాడనుకోవడం లేదని రిప్లై ఇచ్చాను అని చెప్పారు. కానీ అలా చేసినందుకు ఆ తర్వాత నేను ఎంతో బాధపడ్డా. ఇలా ఎప్పుడూ చేయకూడదని నిర్ణయించుకున్నాను. కాగా అభయ్ డియోల్తో గొడవలు వచ్చినప్పుడు కూడా.. నా మాటల వల్ల ఆయన బాధపడుతున్నాడని తెలిసి వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పాను అని అనురాగ్ కశ్యప్ తెలిపారు. అనురాగ్ కస్య నిజంగా సుశాంత్ దగ్గరకు వెళ్లి కలిసి ఉండుంటే ఈరోజు పరిస్థితి మరోలాగా ఉండి ఉండేదని ఆయన అభిమానులు అంటున్నారు ఏది ఏమైనా సరే సుశాంత్ విషయంలో జరగడానికి జరిగిపోయింది కానీ ఆయన మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు సుశాంత్ పెంపుడు కుక్క ఫడ్జ్ కూడా ఇటీవల కన్ను మూసింది.
సుశాంత్ సింగ్ ను పొట్టన పెట్టుకుందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ సోషల్ మీడియా గొంతెత్తి చెబుతోంది. సుశాంత్ తల్లిదండ్రులు, సోదరి కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ అతని మరణం సూసైడ్ అని ముంబై పోలీసులు తేల్చి చెప్పిన విషయం అందరికి తెలిసిందే..