Prabhas -Bala Krishna : బాలకృష్ణ అన్ స్టాపబుల్ -2 లో ప్రభాస్.. వీడియో వైరల్..!

Prabhas -Bala Krishna :  నందమూరి నటసింహం బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్.. ఈ టాక్ షోకు వచ్చిన టిఆర్పి రేటింగ్ మరే టాక్ షోకు రాలేదు అనడంలో సందేహమే లేదు.. అన్ స్టాపబుల్ సీజిన్ 2 మొదలైనప్పటి నుంచి ఈసారి ప్రభాస్ ఈ టాక్ షోకు రానున్నారని సోషల్ మీడియా కోడై కోసింది.. ఇప్పుడు అదే నిజమని ఆహా అధికారికంగా ప్రకటించింది.. అంతేకాకుండా ఓ వీడియోను కూడా విడుదల చేసింది..

Official Prabhas coming on balakrishna unstoppable 2 show
Official Prabhas coming on balakrishna unstoppable 2 show

త్వరలోనే బాహుబలి ఎపిసోడ్ స్క్రీనింగ్ అవుతుంది అంటూ ప్రభాస్, బాలకృష్ణ సినిమాలలోని కొన్ని సీన్లతో వీడియోను రిలీజ్ చేసింది.. ఆహా టీం ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ తో పాటు గోపీచంద్ రానున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ షోకు రానుండడంతో ఎలాంటి విషయాలను బాలయ్య అడుగుతాడు అని ప్రేక్షకులలో ఆత్రుత మొదలైంది. అంతే కాకుండా ప్రభాస్ గోపీచంద్ ఫ్రెండ్ షిప్ గురించి కూడా బాలయ్య వాళ్ళు విషయాలను అడుగుతున్నట్లు టాక్..

ఆదివారం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాలో బాలకృష్ణ కచితంగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావని తీసుకు వస్తారా.. లేదంటే రాజకీయాల గురించి అడుగుతారా అని ఆసక్తిగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇక గోపీచంద్ ప్రభాస్ ఇద్దరూ కలిసి మొదటిసారిగా ఒక టాక్ షోకు రావడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ షో రిలీజ్ అవుతుందా అని ఇప్పటినుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.