Pushpa 2 : Power full dailogue leaked from Pushpa 2..!అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప 2. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి సలహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేసి ట్రెండ్ సెట్ చేయాలని భారీ ప్రణాళికతోనే కదులుతున్నారు చిత్రం యూనిట్. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్ లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని డైలాగులు లీక్ అయ్యాయి.

” అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే? పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్పరాజు వచ్చాడని అర్థం” అనే లెంగ్తి డైలాగ్ ఒకటి లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ డైలాగు నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా అభిమానులలో మరింత కోలాహాలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో పవర్ఫుల్ మాస్ డైలాగులకు కొదవలేదు అని స్పష్టమవుతుంది. అందులో భాగంగానే “వాళ్లు గొర్రెలను కాయడానికి వచ్చారు.. ఆ గొర్రెలను తినడానికి పులి వస్తే.. వేసయ్యడానికి నేను వచ్చాను..” అంటూ పుష్పరాజు పవర్ఫుల్ డైలాగ్ చెబుతాడు. ఈ రెండు డైలాగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.