Samantha : విషయం తెలిసిన మూడు రోజుల తరవాత మనసు చంపుకుని సమంత కోసం ఆసుపత్రికి బయలుదేరిన నాగ చైతన్య.!

Samantha : సమంత, నాగ చైతన్య కలిసి జంటగా నటించిన ఏమాయ చేసావే చిత్రంతో ప్రేమలో పడ్డారు.. ఏడేళ్ల వాళ్ళ ప్రేమ వారిద్దరినీ మూడు ముళ్ల బంధం తో ఒక్కటయ్యారు.. కలిసి నాలుగు ఏళ్లు కాపురం చేయకుండానే వాళ్ళు విడిపోతున్నామని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.. కారణం చెప్పకున్నా.. తాము వేర్వేరు మార్గాల్లో పయనిస్తామని తెలిపారు.. ఇక పై భార్య, భర్తలుగా కొనసాగలేమని.. విడిపోయి మంచి స్నేహితులుగా ఉంటామని తెలిపారు.. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు.. విడాకులపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ పై స్పందిస్తూ సమంత అప్పుడప్పుడు వార్తల్లో వెలిచారు.. వరుస సినిమాలు ఓకే చేస్తూ కూడా ఆమె హాట్ టాపిక్ గా నిలిచారు..

Nagachaithaya meets Samantha in suffering Myositis after 3 days
Nagachaithaya meets Samantha in suffering Myositis after 3 days

నాగ చైతన్య మాత్రం అడపా దడపా సోషల్ మీడియాలో సినిమా ప్రమోషన్స్.. కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు.. విడాకుల తరువాత సమంత నాగచైతన్య కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు.. కనీసం ఒకరు నొకరు కలుసుకోలేదు కూడా.. ఆ మధ్య వాళ్ళిద్దరూ బంగార్రాజు , యశోద సినిమా షూటింగ్లో భాగంగా రామానాయుడు స్టూడియోలో కలుసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ అదంతా ఫేక్ అని ఆ తర్వాత తెలిసింది..

ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.. సమంత చాలా ధైర్యవంతురాలు.. తను ఈ సమస్య ను నుంచి త్వరగా బయట పడాలని.. తను సంపూర్ణ ఆరోగ్యంతో తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కోరుకుంటున్నారు.. సమంత ఆరోగ్యం పై అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ నువ్వు త్వరగా కోలుకోవాలని.. మా ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని ట్వీట్ చేశారు.. అలాగే సుశాంత్ కూడా సమంత ఆరోగ్యం పై స్పందించాడు..

ఇంతమంది స్పందిస్తున్నా కూడా ఇప్పుడు అందరి చూపు నాగచైతన్య పైనే ఉంది.. సామ్ పై నాగచైతన్య కు ఇప్పటికీ ప్రేమ ఉంది.. ఇద్దరు కలిసి పదేళ్లు ప్రేమగా ఉన్నారు.. ఎంత కాదనుకున్న ఒకరి పై ఒకరికి ప్రేమ ఉంటుంది.. కనీసం స్నేహితురాలు అన్న భావంతో సమంత ను కలిస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. సమంత ఈ వ్యాధితో బాధపడుతున్న మూడు రోజుల తరువాత సమంత ను నేరుగా కలవడానికి వెళ్తున్నట్టు వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.. ఈ విధంగానైనా సమంత నాగచైతన్య ఇద్దరు ఒక్కటి కావాలి అని ఇద్దరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..