Singer Sunitha : కొన్ని క్షణాల కిందట వీడియో షేర్ చేసిన సునీత.. స్టన్ అవుతున్న యువత..! 

Singer Sunitha : తెలుగు, కన్నడ, మలయాళం భాషలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం పాటలు పాడడమే కాదు అంతకుమించిన అందంతో అందరిని అలరిస్తూ ఉంటుంది. నాలుగు పదుల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు సైతం తన అందంతో పోటీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ ఎంతోమంది హీరోయిన్లను ప్రేక్షకుల దగ్గరకు చేరవేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించగా .. అందుకు సునీత డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసి సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

Before few seconds Sunitha shared a video.. youth also stun
Before few seconds Sunitha shared a video.. youth also stun

మరొకవైపు గాడ్ ఫాదర్ సినిమాలో నయనతారకి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి మరింత పాపులారిటీని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సునీత ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి మూమెంట్ ను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు పచ్చటి ప్రకృతి చెట్ల మధ్య విహరించిన సునీత ఇప్పుడు మరొక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన యువత కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయారు.

మరి సునీత షేర్ చేసిన ఆ వీడియోలో ఏముంది అంటే చుట్టూ చెట్లు మధ్యలో స్వచ్ఛమైన నదీ తీరాన.. హాయిగా ఊయలూగుతూ కనిపించింది.. అసలే ప్రకృతిని చూసి ఎవరైనా సరే మైమరిచిపోతూ ఉంటారు. అలాంటి ప్రకృతి మధ్యలో ఈమె అలా హాయిగా ఊయల ఊగుతూ మరొకసారి అందరినీ విపరీతంగా ఆకర్షించింది. తమను తాము మైమరిచిపోయి చిన్నపిల్లలా హాయిగా ఉయ్యాల ఊగుతూ మరొకసారి అందరి మదిని దోచుకుంది సింగర్ సునీత. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది. సునీత షేర్ చేసిన ఈ వీడియో చూసి ఇంతటి అదృష్టం ఎవరికీ దక్కదేమో అంటూ కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. సునీతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసి ప్రతి ఫోటో లేదా వీడియో కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోని ఈమె షేర్ చేసిన ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోందని చెప్పవచ్చు.