Guppedanta Manasu 02 Nov Episode : వసుధర చేతిపై రిషి ఏం రాశాడో తెలుసా.!? దేవయానికి, వసుధర మధ్య ఏం జరుగుతుంది.!?

Guppedanta Manasu 02 Nov Episode :  వసుధర ను రిషి అరిచాడని కోపంగా తన బుక్ ఓపెన్ చేసి.. వసుధర రిషి పేర్లను కలిపి రిషిధర అని VR లెటర్స్ ను కలిపి తన బుక్ లో అందంగా రాసుకుంటూ ఉంటుంది.. రిషి సార్ మీరు నా మీద ఎంత అరిచినా కూడా.. నాకు మీ మీద ప్రేమే కలుగుతుంది అని వసుధర మనసులో అనుకుంటూ.. ఆ సింబల్స్ ను దిద్దుతు ఉంటుంది.. అప్పుడే రిషి వసుధార దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న బుక్ ను తీసుకుంటాడు.. సార్ ఇది నా బుక్ నాకు ఇవ్వండి అని వసుధార అంటుంది.. ఈ బుక్ లో నా పేరు ఎందుకు రాసావు అని రిషి అడుగుతాడు.. నా బుక్ నా ఇష్టం సార్.. నా బుక్ లో నాకు నచ్చిన వాళ్ళ పేరు రాసుకుంటాను అని వసుధార అంటుంది.. అదే నా పేరు కూడా ఉందిగా అందుకే తీసుకున్నాను అని రిషి అంటాడు..

Guppedanta Manasu 02 Nov today full Episode
Guppedanta Manasu 02 Nov today full Episode

ఆ బుక్ పై ఉన్న VR అక్షరాలను తన చేతి వేళ్లతో నిమురుతాడు రిషి.. వసుధార నామీద నీకు కోపం లేదా అని అంటాడు రిషి.. కోపం లేదు సార్ ప్రేమ మాత్రమే ఉంది అని వసుధార చెబుతుంది.. వసుధర చేతిని తీసుకొని రిషి తన చేతి పైన VR అని రాసి కింద జెంటిల్ మెన్ అని రాస్తాడు.. ఏంటి సార్ ఇది అని వసుధర అంటుంది.. నా ఆటోగ్రాఫ్ అని రిషి అంటాడు.. అడగకుండా ఇస్తున్నారు అని వసుధార అంటుంది.. అడగకుండానే ఇస్తాను.. అడిగితే ఇవ్వను అని రిషి అంటాడు.. వసుధర అవును నేను నిన్ను పొగరు అని పిలుస్తాను అని నీకు ఎప్పుడు తెలుసు.. ఎలా తెలుసు అని అడుగుతాడు.. వసుధర తనకు ఎలా తెలుసో రిషికి చెబుతుంది.. నువ్వు నన్ను రోజుకి బాగా ఇంప్రెస్ చేస్తున్నావు అని రిషి అంటాడు..

గౌతమ్ మహింద్రా వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు వచ్చేయండి అంకుల్ అని చెబుతాడు.. రిషి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అంకుల్.. మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని గౌతమ్ అంటాడు.. కానీ మహింద్రా రానని చెబుతాడు.. జగతి ఇప్పుడు కాలేజీలో వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది .. అసలే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి.. ఇలాంటి సమయంలో మనం రిషికి దూరంగా వచ్చేసేసాము అని మహింద్రా జగతితో అంటాడు.. పోనీ ఇప్పుడు వెళ్ళిపోదామా అని జగతి అంటుంది.. మనం లేని భారాన్ని మొత్తం వసుధర తీర్చుతుంది.. వసుధార ఒక్కటీ మాత్రమే రిషి భారాన్ని తీర్చగలదు అని జగతి అంటుంది..

రిషి కోసం దేవయాని లంచ్ బాక్స్ తీసుకొని కాలేజీకి వస్తుంది.. చూసావా వసుధర పెద్దమ్మకి నేనంటే ఎంత ప్రేమ అని రిషి అంటాడు.. అవును సార్ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని వసుధార కూడా ఇన్ డైరెక్ట్ గా పంచులు వేస్తుంది దేవయాని.. నీకు భోజనం వడ్డిస్తాను అని దేవయాని అంటుంది.. నీకు ఎప్పుడు ఏం వడ్డించాలో నాకు తెలుసు అంటూ ఇన్ డైరెక్ట్ గా తనని దెబ్బ పొడుస్తుంది దేవయాని.. ఇప్పుడిప్పుడే దేవయాని మేడం గురించి నేను తెలుసుకుంటున్నాను సార్ అని వసుధార అంటుంది త్వరలోనే మీకు మి పెద్దమ్మ నిజ స్వరూపం మీకు తెలుస్తుంది.. జగతి మేడం లాంటి మంచి మనసు మీకు అర్థమవుతుంది.. అప్పుడు దేవయానికి మేడమ్ కి రిషి సార్ సరైన సమాధానం చెబుతాడు అని వసుధార మనసులో అనుకుంటుంది..

వసుధర పుష్పకి ఫోన్ చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి నాకు చాలా టెన్షన్ గా ఉంది అని అంటుంది
. ఆ మాటలను వసుధర రిషి ని తీసుకుని కాలవ గట్టు దగ్గరికి వెళ్తుంది.. అక్కడ రంగురంగుల కాగితాలను పడవలుగా చేసి నీటిలో మీకు ఇష్టమైన కోరిక అక్షరాల రూపంలో రాసి వదలమని వసుధర చెబుతుంది .. వసుధార మనసులో ఏం కోరిక కోరుతుందో తరువాయి భాగంలో చూద్దాం..