Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో. తెలుగు చలనచిత్రా రంగంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టే వారిలో మొదటి వరుసలో మహేష్ ఉంటారు. జయ పజయలతో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాలకు.. భారీ ఎత్తున ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఇక ఫ్యామిలీ విషయంలో మహేష్ చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
ఏమాత్రం షూటింగ్లకు గ్యాప్ దొరికిన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళిపోతుంటారు. ఇంకా కుదిరితే ఇండియాలోనే పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కుటుంబంలో మహేష్ బాబు ని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి అక్క మంజుల. మహేష్ సినిమాలకు సంబంధించి రిజల్ట్ ఎలా ఉన్నా నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారా ఆమె. సూపర్ స్టార్ గా తమ్ముడు ఎదిగిన తీరు కూడా మంజులకి ఎంతో ఇష్టం. అయితే ఇటీవల మహేష్ బాబు కోసం అక్క మంజుల పది కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు కొనివ్వడం జరిగిందంట.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్క మంజుల ఇచ్చిన గిఫ్ట్ మహేష్ బాబుకి ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” అనే సినిమా మహేష్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కానుంది. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నారు. దాదాపు 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.