Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన ఆమె ప్రస్తుతం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఖుషి సినిమా విజయంతో మొన్నటి వరకు ఇండియాలోనే సక్సెస్ సంబరాలలో బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయినా ఆమె అక్కడ కొన్నాళ్లు పాటు ఉంది.
ఆ తరువాత ఇండోనేషియాలోని బాలి ట్రిప్ కి వెళ్లడం జరిగింది. అమెరికాలో మయోసైటీస్ వ్యాధికి కొద్దిగా ట్రీట్మెంట్ కూడా అంతకుముందే తీసుకోవడం జరిగింది. అనంతరం ప్రకృతి అందాలను ఆస్వాదించటం తనకు ఇష్టమని తెలియజేస్తూ ఆస్ట్రియాకు వెళ్లింది. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రియాలో సైకిల్ మీద అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది. ప్రజెంట్ సెల్ట్ బర్గ్ నగరంలో హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
అదేనగరంలో ఓ సరసు పక్కన సైకిల్ తొక్కుతూ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే దాదాపు ఏడాది పాటు ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా పలు అందాలను… అందమైన ప్రదేశాలను చూడాలని రిలాక్స్ అవ్వాలని సమంత డిసైడ్ అయ్యిందట. గత ఏడాది అక్టోబర్ నెలలో మయోసైటీస్ వ్యాధి బారిన పడటం జరిగింది. ఆ సమయంలో హెల్త్ పరంగా చాలా గ్లామర్ పోయింది. తీసుకున్న ట్రీట్మెంట్ కి మునుపటి ఛాయా ముఖంలో పోవటంతో.. ప్రజెంట్ ఒక ఏడాది పాటు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది.