Couples secret : ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతిలలో భారత సంస్కృతి చాలా పురాతనమైనది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలలో భారత కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైనది. వేరే దేశాలలో తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోరు. కొంత వయసు వచ్చాక తల్లిదండ్రులు కూడా పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చేసి వాళ్ల బతుకు.. వాళ్లే బతకాలని వదిలేస్తారు. కానీ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా విభిన్నమైనది. కానీ ప్రస్తుత తరం లో.. భారతదేశంలో కూడా కుటుంబ వ్యవస్థ ప్రమాదంలో పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత.. ప్రేమానురాగాలు అసలు కనబడటం లేదు. చాలామంది అక్రమ సంబంధాలకు గురై.. ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకుంటున్నారు. ఇంటిలో ఉన్న సభ్యులకు విలువ ఇవ్వకుండా.. సోషల్ మీడియాలో లేదా బయట పరిచయమైన వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చి.. కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేసి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని విషయాలు ఇంట్లో భార్యకు చెప్పటం వల్ల భర్త చులకన కావడం మాత్రమే కాదు విలువ లేకుండా తన జీవితాన్ని చేసుకుంటారని తాజాగా ఓ విషయం బయటపడింది.
అందులో మొదటిది ఏ మగవాడు తన సంపాదన గురించి ఇంట్లో భార్యకు చెప్పకూడదట. ఇక రెండవది ఏ మగవాడు తన బలహీనతలు భార్యకు చెప్పకూడదు. ఒకవేళ చెబితే భార్య పదేపదే అదే బలహీనత గురించి మాట్లాడటం వల్ల భర్త మానసికంగా కృంగిపోతాడట. ఇక మూడవది ఏ పురుషుడు తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు గురించి భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న గొడవ జరిగినా కూడా…వీటి గురించి అందరి ముందు ప్రస్తావిస్తూ ఉంటుందట. భర్తలు ఎప్పుడు కూడా ఈ మూడు విషయాలు తమ భార్యలకి చెప్పకూడదట.