Manchu Lakshmi : సరిదిద్దుకోలేని తప్పు చేశాను అంటున్న మంచు లక్ష్మీ.. పోస్ట్ వైరల్..!

Manchu Lakshmi : తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు.. ఆయన కుమారులు కూడా సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో బాగానే ఆక్టివ్ గానే ఉంటుంది. ముఖ్యంగా తన ప్రాజెక్టు పైన తన కుటుంబంలో జరిగే విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక స్టోరీ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది.

Manchu Lakshmi done mistakes so many..post viral.!
Manchu Lakshmi done mistakes so many..post viral.!

మంచు లక్ష్మి ఆ స్టోరీలో ఏమి రాసుకొచ్చిందంటే.. తన జీవితంలో సరిదిద్దుకోలేని కొన్ని తప్పులు చేశాను.. వాటిని నేను ఇప్పుడు మార్చలేను.. కానీ నేను మారాను. కాబట్టే అవే తప్పులను నేను తిరిగి చేయను అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారుతోంది. దీంతో మంచు లక్ష్మి ఎలాంటి తప్పులు గురించి ప్రస్తావిస్తూ ఉందో అంటూ అభిమానుల నుంచి ప్రశ్నలు వెలువడుతూనే ఉన్నాయి.

మంచు లక్ష్మీ మాత్రం ఈ స్టోరీ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతుంది. ఏది ఏమైనా మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.