Allu Arjun : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతో అరుదైన అవార్డులను అందుకుంటున్నాడు.. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా దుమ్మురేపిన బన్నీ కి మరో ఆరుదైన ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

GQ మ్యాగ్జైన్ ఇచ్చే లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నాడు. 2022 సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. రాజకీయాలు, ఫ్యాషన్, కల్చర్ కు సంబంధించిన భాగాల్లో అద్భుతంగా రాణించిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. తనకు ఈ అవార్డు వచ్చిన విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అవార్డు తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేశారు.
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న తొలి నటుడుగా అల్లు అర్జున్ ఘనత సాధించారు. తనకు అరుదైన గుర్తింపు గౌరవాన్ని అందించిన జి క్యు మ్యాగజైన్ కు అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన జూరీ మెంబర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. తన లిస్టులో ఎన్నో అచీవ్మెంట్స్ రాసి పెట్టుకున్నానని వాటిలో తొలి అచీవ్మెంట్ కంప్లీట్ చేసినట్లు బన్నీ తెలిపారు..