Manchu Family : మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్.. మ‌నోజ్‌ని ఒంటరి వాడిని చేశారా…!

Manchu Family:  టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక‌మైన గుర్తింపు ఉంది. మంచు మోహ‌న్ బాబు వైవిధ్యమైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోగా, ఇక ఆయ‌న వార‌సులుగా మంచు విష్ణ‌, మ‌నోజ్ కూడా సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మంచు ల‌క్ష్మీ సైతం ప‌లు చిత్రాల‌లో న‌టించి సంద‌డి చేసింది. 500 లకు పైగా చిత్రాల్లో నటించి మోహన్ బాబు నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మంచు విష్ణు, మనోజ్ ఫెయిల్ అయ్యార‌నే చెప్పాలి. వారిద్ద‌రు కనీసం టైర్ టూ హీరోల సరసన చేరలేకపోయారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వాళ్ళను దాటి ముందుకు వెళ్లిపోతున్నా వీరి ప‌రిస్థితి మాత్రం దారుణంగా ఉంది.

manchu-family-ht-topic-now
manchu-family-ht-topic-now

నిజ‌మెంత ఉందో మ‌రి..

ఇటీవ‌లి కాలంలో మంచు ఫ్యామిలీ హీరోలు దారుణంగా బాక్సాఫీస్ ద్గ‌ర విఫ‌లం అవుతున్నాయి. సన్ ఆఫ్ ఇండియా, జిన్నా టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్స్ గా మిలిగిపోయాయ‌నే చెప్పాలి.. ఒక ముక్కు ముఖం తెలియని హీరో సినిమా చేసిన అంత కంటే మంచి వసూళ్లు వస్తుండ‌గా, మంచు ఫ్యామిలీ హీరోలు చేసిన సినిమాల‌కు మినిమం వ‌సూళ్లు రాక‌పోగా, భారీ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌నోజ్ ఇటీవ‌ల సినిమాల‌కు దూరంగా ఉంటుండ‌గా, దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి కూతురైన మౌనికతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు అనే ప్ర‌చారం న‌డుస్తుంది.

వినాయక పండుగ సమయంలో మనోజ్-మౌనిక కలిసి పూజలు చేయ‌గా, మౌనికను వివాహం చేసుకోవాలని మనోజ్ భావిస్తున్నాడ‌ని టాక్. అయితే ఈ సంబంధం మంచు విష్ణుతో పాటు కుటుంబ సభ్యులకు అస్స‌లు ఇష్టం లేదట. తన మాట వినకుండా మౌనికతో ఉంటున్న మనోజ్ పై కుటుంబ సభ్యులు గుర్రుగా ఉన్నారట. అంతేకాదు మ‌నోజ్‌ని కాస్త దూరం పెట్టినట్టు కూడా ప్ర‌చారం న‌డుస్తుంది. మ‌రి ఫిలిం న‌గ‌ర్ లో ప్రచారం జరుగుతున్న ఈ కథనాల్లో వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది.