Smart TV Offers : ఈమధ్య కాలంలో పండుగలు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఆఫర్లు వస్తాయని.. తక్కువ ధరకే టీవీని సొంతం చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. అలాంటివారి కోసమే శుభవార్తను తీసుకొస్తున్నాయి ఈ కామర్స్ దిగ్గజాలు.. ఈ క్రమంలోనే మీరు బెస్ట్ స్మార్ట్ టీవీ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. కళ్ళు చెదిరే ఆఫర్ ఒకటి ప్రస్తుతం అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే సూపర్ డీల్ తో స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. క్రోమా వెబ్సైట్లో తక్కువ ధరకే స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.43 వేల భారీ డిస్కౌంట్ తో మీరు సొంతం చేసుకోవచ్చు.
ట్రీవ్యూఇండ్ 43 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం భారీ డీల్ అందుబాటులో ఉంది . ఈ టీవీ ఎంఆర్పి ధర రూ.52,999 కాగా దీనిని కేవలం రూ.10,590 కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా 80% లేదా రూ.42,400 వరకు తగ్గింపు లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే.. 43 అంగుళాలు స్మార్ట్ టీవీ ని కొనాలని భావించేవారు ఈ టీవీ నీ సొంతం చేసుకోవచ్చు. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి . ముఖ్యంగా హెచ్ ఎస్ బి సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే 7.5% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
అలాగే ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అప్పుడు మీరు ఈ టీవీ పై ఏకంగా 1000 రూపాయలు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈటీవీలో 60 HZ రిఫ్రెష్ రేటుతో 2 హెచ్డిఎంఐ పోర్ట్ ట,2 యు ఎస్ బి పోర్ట్ లు అందుబాటులో ఉన్నాయి.