Mahesh Babu – Rajamouli : ఈ న్యూస్ తెలిస్తే మహేష్ ఫ్యాన్స్ రాజమౌళికి గుడి కట్టేస్తారు..!!

Mahesh Babu – Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాలో సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. బాహుబలి తో తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ఇండియా వైడ్ గా చాటారు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు.. ఈ సినిమా ఆస్కార్ బరిలో పోటీ పడుతుంది.. దాంతో రాజమౌళి దర్శకత్వంలో రానున్న మహేష్ సినిమా పై పలు క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. రాజమౌళి ఈ సినిమాని కనివిని ఎరుగని రీతిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు..!!

మహేష్ చిత్రాన్ని రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ గా.. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు యాత్ర లాగా ఉంటుందని తెలిపారు.. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరక్కించాలని రాజమౌళి భావిస్తున్నారు.. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ను కూడా తీసుకోవాలని అనుకుంటున్నారట.. ఆర్ఆర్ఆర్ సినిమాకి అంతర్జాతీయంగా ముఖ్యంగా వెస్ట్ సైడ్ కంట్రీస్ నుంచి మంచి అభినందనలు వచ్చాయి.. ఇప్పటికీ మంచి ప్రశంసలు వస్తున్నాయి.. అందుకే ఈ సినిమాని పూర్తిగా ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా టేక్ ఓవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి.. అందుకోసం ఏకంగా ఓ హాలీవుడ్ టాలెంట్ కంపెనీ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ సిఏఏతో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం..

Mahesh fans will build a temple for Rajamouli if they know this news
Mahesh fans will build a temple for Rajamouli if they know this news

సిఏఏతో ఒప్పందం చేసుకున్న వారికి అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుంది.. అలా రాజమౌళి సినిమాకి అంతర్జాతీయ కాస్టింగ్ ఇవ్వడంతో పాటు అంతర్జాతీయంగా ప్రాజెక్టు చేస్తుంది.. ఇది మహేష్ సినిమాకి హెల్ప్ కాబోతుందని ఇదంతా రాజమౌళి వేసిన మాస్టర్ ప్లాన్ అని తెలుస్తుంది.. ఊహించని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో రాజమౌళి ఉన్నారట.. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇదే నిజమైతే ఇక మహేష్ సినిమా బాక్స్ ఆఫీస్ కి చుక్కలు చూపించడం ఖాయం.. అంతర్జాతీయంగా ఈ చిత్రంలో అతిశయోక్తి లేదు.. ఇది మహేష్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్తాన్ని చెప్పడంలో సందేహమే లేదు.. ఈ చిత్రం కోసం అటు మహేష్ ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..