Singer Sunitha : అమ్మవారి లాగా అందంగా ముస్తాబైన సింగర్ సునీత.. ఇన్ స్టా లో వైరల్..!!

Singer Sunitha : సింగర్ సునీత.. గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టు కూడా.. సింగర్ సునీతను ఒక సైడు నుంచి చూస్తే మనకు గాయనిగా అర్థమవుతుంది.. కానీ ఆమెను పూర్తిగా గమనించినట్లయితే హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని కట్ ఔట్ తో తన అందంతో చూడ చక్కని మోముతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడంలో సునీత తర్వాతే ఎవరైనా.. చాలా అందంగా బుట్ట బొమ్మలా కనిపిస్తూ ఉంటుంది. ఇక ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు సాంప్రదాయ పద్ధతిలో కూడా తనను తాను మేకోవర్ చేసుకోవడంలో సునీత మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.. ఒకవైపు సింగర్ గా బాధ్యతలు చేపట్టిన ఈమె మరొకవైపు భార్యగా, తల్లిగా కూడా తన బాధ్యతలను నెరవేరుస్తోంది.

singer-sunitha instagram photos traditional look
singer-sunitha instagram photos traditional look

అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో మచ్చటిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే త్వరలోనే దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఒక సాంగును కూడా ఈమె త్వరలోనే విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఒక ఆల్బమ్ సాంగ్ విడుదల చేసే క్రమంలో తాను కూడా అమ్మవారిలా చాలా చక్కగా ముస్తాబయి అందుకు సంబంధించిన వీడియో ను కూడా షేర్ చేసుకుంది. నవరాత్రి స్పెషల్ సాంగ్స్ త్వరలోనే వస్తున్నాయి స్టే ట్యూన్డ్ అంటూ కూడా ఆమె రాసుకొచ్చింది.. ఇక ఇందుకు సంబంధించిన ఒక చిన్న వీడియోను సునీత షేర్ చేయగా అందులో ఆమెకు మేకప్ మ్యాన్ లు చక్కగా ముస్తాబు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఆమె దైవ సన్నిధిలో దైవ స్మరణతో లీనమైనట్టు మనం చూడవచ్చు.

సాంప్రదాయబద్ధంగా అమ్మవారిలా.. కట్టు బొట్టుతో చూడచక్కగా తయారైన సునీత అందానికి చూపర్లు సైతం ఆకర్షితులవుతున్నారు. ఇక ఆమె అందానికే కాదు ఆ వీడియోలో వచ్చిన పాటకి కూడా ప్రేక్షకులు ఫిదా అవ్వడమే కాకుండా దేవీ నవరాత్రుల పాటల కోసం ఎదురుచూస్తున్నాము అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోతో సునీతపై ప్రశంసల వర్షం కురుస్తోంది అని చెప్పవచ్చు.