Amazon Great indian festival sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఈ 4 వస్తువులపై భారీ తగ్గింపు.. ఆఫర్ మళ్ళీ రాదండోయ్..!

Amazon Great indian festival sale :  నవరాత్రులు , దసరా, దీపావళి పండుగలు భారతదేశంలో నలుమూలలా జరగబోతున్న నేపథ్యంలో కస్టమర్లకు ముందుగానే మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజాలు.. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ- కామర్ సంస్థ అమెజాన్ ఈనెల 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. ఇక ఇందులో భాగంగానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ల నుంచీ గ్రాసరీల వరకు వివిధ వస్తువులపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇకపోతే ఈ సందర్భంగా సగం కంటే తక్కువ ధరకే అమెజాన్ అందిస్తున్న ఈ వస్తువుల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

ఎకో ఫ్లెక్స్ ప్లగ్ ఇన్ ..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ పరికరాన్ని మీరు రూ. 1500 తగ్గింపుతో కేవలం రూ.1499 కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంది. తద్వారా వాయిస్ కమాండ్ సహాయంతో ఇతర స్మార్ట్ హోమ్ పరికరాలను కూడా మీరు నియంత్రించవచ్చు.

అలెక్సా తో.. ఎకో డాట్ -3 స్మార్ట్ స్పీకర్..

ఈ స్పీకర్ మీకు రూ.2,950 తగ్గింపుతో ఈ స్పీకర్ ను మీరు అమెజాన్ నుండి కేవలం రూ.1,549 కే కొనుగోలు చేయవచ్చు . ఇక ఈ స్పీకర్ మిగిలిన స్పీకర్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో వాయిస్ కమాండ్ తో పాటు హ్యాండ్స్ ఫ్రీ మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్, కంట్రోల్ స్మార్ట్ ఫోన్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ మీకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది.

Amazon Great Indian Festival Sale.. Huge discount on these 4 items
Amazon Great Indian Festival Sale.. Huge discount on these 4 items

ఎకో షో -5..

ప్రస్తుతం ఈ పరికరాన్ని మీరు కేవలం రూ.3,999 కే సొంతం చేసుకోవచ్చు. నిజానికి మార్కెట్లో దీని ధర రూ.8,999.. ఇక మీరు రూ.5000 తగ్గింపుతో ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్పీకర్ మీకు 5.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీనిని వాయిస్ కమాండ్ తో కూడా మీరు నియంత్రించవచ్చు. అలాగే మెరుగైన వీడియో కాలింగ్, కెమెరా సౌకర్యం కూడా ఉంటుంది. అంతేకాదు కెమెరా పైకి కనిపించకుండా ఉండేందుకు షట్టర్ ని కూడా ఏర్పాటు చేశారు.

ఫైర్ టీవీ స్టిక్ 4K..

ఇక దీనిని కూడా మీరు భారీ తగ్గింపుతో కేవలం రూ.2,999 కే కొనుగోలు చేయవచ్చు. ఇది అత్యంత వేగంగా పనిచేయడంతో పాటు అంతే వేగంగా వైఫై కి కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. మరొకవైపు దీని సహాయంతో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ యాప్ లను డాల్బీ విజన్ 4కే రెజల్యూషన్ తో ఆస్వాదించవచ్చు.