Getup Srinu : బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కనెక్ట్ అయింది. టీ ఆర్పీ రేటింగ్ కూడా సంచలనలు సృష్టించింది ఈ షో.. అంతేకాకుండా జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది.. జబర్దస్త్ షో కమెడియన్ నుంచి వెండి తెరకు పరిచయం అయ్యారు చాలా మంది. ఈ షో తో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో గెటప్ శ్రీను..
తన గెటప్ లతో పంచులు వేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు గెటప్ శ్రీను.. వైవిధ్య భరితమైన గెటప్ తో శ్రీను కాస్త గెటప్ శ్రీను గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. బుల్లితెర పై వచ్చిన క్రేజ్ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించాడు గెటప్ శ్రీను.. బుల్లితెర కమల్ హాసన్ గా గుర్తిపు తెచ్చుకున్నాడు.
తాజాగా గెటప్ శీను తన భార్యతో కలిసి తిరుపతి వెళ్లారు. స్వామిని దర్శనం చేసుకున్నా అనంతరం వీరిద్దరూ కలిసి బయటకు వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కరోనా తరువాత శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అది కూడా సతీసమేతంగా భార్యతో కలిసి రావడం ఇంకా ఆనందంగా ఉందని గెటప్ శీను అన్నారు. గెటప్ శీను తన అభిమానులు అడిగిన వారందరికీ ఓపికగా సెల్ఫీలు ఇచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గెటప్ శీను భార్య సుజాత. శ్రీనుకి సినిమా అవకాశాలు లేని సమయంలో తన భార్య సుజాత ఎంతో అండగా నిలిచిందని చెప్పుకొచ్చాడు. శ్రీను అలాగే తన పెళ్లి కాకముందు.. తన భార్య సుజాతను చెన్నైలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి తీసుకెళ్లాలనాని.. అయితే ఆ ఇంటర్వ్యూలో తనకి ఉద్యోగం వచ్చినా కూడా నాకోసమే ఆ ఉద్యోగం వద్దని వదిలేసుకుని వచ్చేసిందని.. తన భార్య ఎప్పటికీ తనని ప్రేమిస్తుండడం నా అదృష్టమని గెటప్ శీను ఓ ఇంటర్వ్యూలో చెబుతూ బాగా ఎమోషనల్ కూడా అయ్యారు.