Chandrababu Naidu : గవర్నర్ తో భేటీ అయినా చంద్రబాబు అందుకేనా..

Chandrababu Naidu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఏపీ రాజు భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.. చంద్రబాబుతో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తనతో పాటు వచ్చిన టిడిపి నేతలను చంద్రబాబు గవర్నర్ కు పరిచయం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల పైన ఆయనతో మాట్లాడినట్లు సమాచారం . వివిధ పరిణామాలను గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారని సమాచారం.

ఈ సందర్భంగా గవర్నర్ ను కలిసిన వారితో చంద్రబాబు వెంట ఎనమల రామకృష్ణుడు, నక్క ఆనంద్ బాబు , వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరు సాంబశివరావు, కొనకళ్ళ నారాయణ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చంద్రబాబు నాయుడు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా ఎస్ అబ్దుల్ నజీర్ బాధితులు స్వీకరించారు. ఏపీ మూడో గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయనకు గొప్ప నేపథ్యం ఉంది అత్యంత అనుభవం ఉన్న ఆయనకి ఏపీ గవర్నర్గా రావడంతో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు.

గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వీరిద్దరితోపాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత సీఎం జగన్ చీఫ్ జస్టిస్ మిశ్రా గవర్నర్ నజీర్ కు స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ కర్ణాటక రాష్ట్రంలోని బెలూవాయిలో 1958 జనవరి 5న జన్మించారు.