Raghurama Krihsnamraju : మరో ఐడియా తో వచ్చిన రఘురామ సీబీఐ కి క్లూ ఇచ్చారా..

Raghurama Krihsnamraju :నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ గా మారతారు.ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నాయని తెలిసిందే. అయినా కానీ రఘురామకృష్ణంరాజు తన వైఖరిని మార్చుకోకుండా జగన్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక గత కొన్ని రోజులుగా వివేకా కేసు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది ఇక ఈ విషయంపై రఘురామా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు..

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ గా మారతారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నాయని తెలిసిందే. అయినా కానీ రఘురామకృష్ణంరాజు తన వైఖరిని మార్చుకోకుండా జగన్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక గత కొన్ని రోజులుగా వివేకా కేసు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది ఇక ఈ విషయంపై రఘురామా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు..

మాజీమంత్రి వివేకానంద ను చంపవలసిన అవసరం ఎవరికీ ఉంది అసలు అక్కడి వరకు తీసుకువెళ్లిన పరిణామాలు ఏంటి.. పరిస్థితులు ఏంటి.. ఎవరెవరు ఏ విధంగా ఈ ప్లాను అమలు చేశారు అంటూ.. ఓ గొడ్డలి కథలో కూడా రఘురామా చెప్పి సెన్సేషన్ గా మారారు. మరోవైపు సిబిఐ కౌంటర్లో అసలు ఈ వధ లో భాగంగా ఎవరెవరి పాత్ర ఏంటి అని పూస గుచ్చినట్లు వివరించింది. అయితే ఈ కేసు మరో తప్పు దోవ పట్టకుండా రఘురామ మరికొన్ని వ్యాఖ్యలు వీటికి జోడించారనే చెప్పాలి.

అందరూ వివేకా కేస్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.. అసలు వివేకా కేసులో కొంతమందికి సంబంధం లేదని సాక్షి పేపర్లో పలుమార్లు పలు వార్తలు వచ్చాయి. ఇప్పుడు నా వాదన ఏంటంటే.. ఉదయ్ కుమార్ తో కంప్లైంట్ పెట్టించి ఎవరో పెద్దవారి హస్తం ఉందని నా ఆలోచన అని రఘు రామ అన్నారు. కచ్చితంగా పెద్దవారి చేతిలో లేకుండా ఎంత దూరం రాదని.. సాక్షిలాంటి పెద్ద పేపర్లో ఇలాంటి వార్తలు అంత సామాన్యంగా బయటికి రావని రఘురామా విమర్శలు చేశారు..

సాక్షి పేపర్లో ఇంత గట్టిగా ఒక వార్త గురించి పేపర్లు పేపర్లు రాయడానికి ఎవరో ఉన్నారని గట్టిగా అనరాదు మీరు వినరాదు అంటూ వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు రఘురామ. వివేకా ప్రాణాలు తీసిన కేసులో కొంతమంది పేర్లు అక్కడ రాశారు అలాంటి వారిని అరెస్టు చేయకపోతే అది సరికాదని రఘురామ అన్నారు. ఇప్పుడు ఒకవేళ సిబిఐ కౌంటర్ చేసిన వ్యాఖ్యలు ప్రకారం.. ఒకవేళ అది జరగకపోతే అందరికీ అవమానమే అని రఘురామా అన్నారు.