Singer Sunitha : సునీత ప్రెగ్నెన్సీ నా.? ఒక్కమాటతో క్లారిటీ..

Singer Sunitha : సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. స్టార్ హీరోయిన్ కి మించిన క్రేజ్ ను సంపాదించుకుంది. ఎన్నో వేలకు పైగా పాటలను పాడి శ్రోతలను అలరించింది.. తాజాగా సింగర్స్ సునీత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్ లో సింగర్స్ సునీతది ప్రత్యేకమైన స్థానం. మధురమైన స్వరమే కాకుండా అందరినీ ఆకర్షించే అందం ఆమె సొంతం. సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 42 ఏళ్ల సునీత రెండో పెళ్లి చేసుకోవడం అప్పట్లో సెన్సేషనల్ అయింది. వ్యాపారవేత్త మ్యాంగో మ్యూజిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వీరపనేని రెండు సంవత్సరాల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకుంది.

Is Singer Suneetha pregnent clarity on her
Is Singer Suneetha pregnent clarity on her

తాజాగా ఆమె మళ్లీ గర్భవతి అయింది అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం ఆ నోట ఏ నోటా పాకి సునీత వరకు వెళ్ళింది. దాంతో ఈ విషయం తెలుసుకున్న సునీత స్పందించింది. అవునా నేను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియదే .. అని సరదాగా వ్యాఖ్యానించింది. ఈ వార్త తనకు గాని తన జీవితానికి గాని సంబంధించింది కాదని తెలిపింది. ఇలాంటి రూమర్లు సృష్టించిన వారి ఆలోచన స్థాయికి చెందినదని తనదైన శైలిలో విమర్శించింది.

గతంలో సునీత ఓ మామిడికాయ చెట్టు దగ్గర నిలబడి ఓ ఫోటో షేర్ చేయగా.. అప్పుడు కూడా సింగర్ సునీత ప్రెగ్నెంట్ అని పుల్ల పుల్లవి తినాలనిపిస్తుంది అని రకరకాలుగా కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా సునీత తనదైన స్టైల్ లో ఆ వార్తలను తిప్పుకొట్టింది. ప్రస్తుతం సింగర్ సునీత కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. తన కొడుకును వెండి తెరకు పరిచయం చేసే పనిలో పడింది.