YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్ తో మీ సమస్యకు పరిష్కారం చూపుతానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్, జిందాల్ కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్ తో కలిసి భూమి పూజ చేశారు.. 30 నెలలలోపు స్టీల్ ప్లాంట్ తొలి దశ పూర్తవుతుందన్నారు..
8800 కోట్ల రూపాయలతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఈ జిల్లా మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతే కాకుండా అక్కడ ఉన్నవారికి ఉపాధి కూడా దొరుకుతుందని వివరించారు. ఏ సమస్య అయినా ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కారం చేస్తానంటూ.. ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ సభ వేదికపై సజ్జన్ జిందాల్ కు హామీ ఇచ్చారు.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని నాడు వైయస్సార్ ఆలోచన చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు ప్రాజెక్టు పూర్తిచేస్తామని తెలిపారు. రెండు దశలలో ఈ ప్లాంట్ ను పూర్తి చేసేందుకు జిందాల్ ప్రణాళిక రూపొందించారని వివరించారు. మొదటి స్టేజ్ లో రూ. 3300 కోట్లతో పూర్తి చేస్తామని.. రెండో దశలో రూ. 5 వేల కోట్లతో ఐదేళ్ల లోపు పూర్తి చేస్తామని చెప్పారు..
ఈ ప్రాంతంలో మూడు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు కూడా స్థానికులకే ప్రాధాన్యత కలిగించునున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 75 వేల ఉద్యోగాలు రాబోతున్నట్లు జగన్ తెలిపారు.