Pawan Kalyan : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలను రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజినోవా తో ఉన్నారు. ఆమె క్రిస్టియన్ కూడా అయితే ప్రతి క్రిస్మస్ పండగకి పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి రష్యాకు వెళుతూ ఉండేవారు. అయితే ఈసారి ఈ వేడుకలకు దూరంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమా షూటింగులు.. రాజకీయ కారణాల చేత రష్యాకు పవన్ కళ్యాణ్ వెళ్లలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అన్నా లెజినోవా పవన్ పైన కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తో ఆమె గొడవ పడినట్లుగా కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త అయోమయంలో పడ్డారు. ఇంత చిన్న విషయానికి ఇద్దరు గొడవపడడం ఏమిటి ఇది ఎవరో సృష్టించిన వార్త అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు అభిమానులు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా మరికొంతమంది దర్శకుల సినిమాలను ఓకే చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.