Pragathi : ప్రగతి హీరోయిన్ గా నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా..?

Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రగతి ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో తల్లి, అత్త, అక్క పాత్రలో నటిస్తూ అలరిస్తోంది. ఇటీవల ఎఫ్2 , ఎఫ్3 సినిమాలో ప్రగతి హీరోయిన్ తమన్నా తల్లి పాత్రలో నటించి తన నటనతో విపరీతంగా ఆకట్టుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఒకప్పుడు హీరోయిన్గా నటించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నటి ప్రగతి అప్పట్లో ప్రముఖ సినీ దర్శకుడు భాగ్య రాజా హీరోగా నటించిన గౌరమ్మ నీ మొగుడెవరమ్మా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

Do you know whitch film Pragathi acted as the heroine?
Do you know whitch film Pragathi acted as the heroine?

అలాగే ఈ చిత్రం మలయాళం తెలుగు భాషలలో కూడా విడుదలయ్యింది. కానీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా అలరించలేదు . దీంతో ప్రగతి కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితం పై దృష్టి పెట్టింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చి దూరమైంది. ప్రస్తుతం తన భర్తతో వేరుగా ఉన్న ప్రగతి పిల్లల సంరక్షణ బాధ్యత కూడా తానే తీసుకొని పెంచుతోంది.