bigg boss himaja : టాలీవుడ్ నటి బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తెరపై ప్రసారమైన సీరియల్ తో తన కెరియర్ ను మొదలుపెట్టి అటు నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు అడుగులు వేసింది.. వీటితోపాటు పలు అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తూ కెరియర్ లో దూసుకెళ్తోంది హిమజ..
బుల్లితెర నటిగా పేరు తెచ్చుకున్న హిమజ.. సినీ రంగంలోనూ కామెడీ పాత్రలు కీలక రోల్స్ లో నటించి తనదైన ముద్రను వేసుకుంది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది నటన పరంగానే కాకుండా సోషల్ మీడియాలను హిమాజ యాక్టివ్ గా ఉంటుంది.. తన పర్సనల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది.. ఇటీవల హిమజ ఓ ఇంటిని కూడా నిర్మించుకుని నాలుగు అంతస్తుల బిల్డింగ్ వీడియోని కూడా ఆమె షేర్ చేయగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. మొన్న సంక్రాంతికి కూడా హిమజ కియా కార్నివాల్ కార్ ను కొన్న సంగతి తెలిసిందే..
హిమజ అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ నేటిజన్స్ ను ఫిదా చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసి మంచి మంచి వీడియోలు తన అభిమానులతో పంచుకుంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్స్టా వేదికగా ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.
తాజాగా హిమజ తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో నల్లటి చీరలో తన అందాలతో మరోసారి అట్రాక్ట్ చేసింది.. ఎంతో క్యూట్ గా కనిపిస్తూ కుర్రాళ్ళ గుండెలను చెదరగొట్టింది.. చాలా అందంగా ఉన్నావ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ అభిమాని మాత్రం అచ్చం ప్రగ్యా జైస్వాల్ లాగా ఉన్నావు అంటూ కామెంట్ చేయగా.. ప్రస్తుతం బ్లాక్ శారీలో ఉన్న హిమజ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.