SIR Movie Review : ధనుష్ సార్ సినిమా రివ్యూ ఇచ్చిన జబర్దస్త్ మహిధర్..

SIR Movie Review : తమిళ హీరో ధనుష్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ.. తెలుగు, తమిళం బై లింగ్వల్ గా సార్ మూవీ చేశారు.. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు నేడు ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో విడుదలైంది.. కాగా నిన్న రాత్రి ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో వేయగా.. ముందుగానే ఈ సినిమా రివ్యూ చెప్పేశారు జబర్దస్త్ మహిధర్.. ఆయన మాటల్లో అసలు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

సార్ సినిమా బాగుంది. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం. చదువు నేపథ్యంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయో అనే విషయాన్ని చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారు. విలనిజం, హీరోయిజం ని ఎక్కువగా హైలెట్ చేయలేదు.. ఎడ్యుకేషన్ ముందుకు తీసుకువెళ్లారు. సెకండ్ హాఫ్ లో హై లెవెల్ ఎమోషన్స్ సీన్స్ ఉంటాయి. కానీ కథ మాత్రం అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఫన్ ట్రాక్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.

 

సినిమాలో కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమాపై మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా కథ కొత్తదని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఇంతకుముందే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వేలో చాలా సినిమాలు వచ్చాయి. ఆల్రెడీ ఇలాంటి సినిమాలను చూశాం కాబట్టి అంతకుముందే సినిమా చూశామన్న భావన మాత్రం కచ్చితంగా కలుగుతుంది. ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చూశావన్నా ఇంప్రెషన్ మాత్రం కచ్చితంగా ఉంటుందని మహిధర్ చెప్పారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ధనుష్ మాత్రం ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు అలాగే డైరెక్టర్ కూడా ధనుష్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. కొన్ని కొన్ని సీన్స్ లో మాత్రం ఆయన నటన అద్భుతంగా ఉంటుంది ఇక ధనుష్ సరసన నటించిన సంయుక్త కూడా తన పాత్రకు తగిన న్యాయం చేసిందని చెప్పాలి. ఈ సినిమాను తనదైన శైలిలో తీసుకువెళ్లారు అట్లూరి.. కొత్త ఫ్లాట్ కాకపోయినా కానీ ఇంట్రెస్టింగ్ గా చూపించారు వెంకీ అట్లూరి.

ఈ సినిమాలో మరొక చెప్పుకోదగిన విషయం ఏమిటంటే మ్యూజిక్ జీవీ ప్రకాష్.. ఈ సినిమాలోని పాటలు కంప్లీట్ గా తమిళం అనిపించదు. కంప్లీట్ గా తెలుగు అనిపించదు. మాస్టారు మాస్టారు సాంగ్ థియేటర్లో కూడా అల్టిమేట్ హీట్ అయింది. మొత్తంగా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ అక్కడక్కడే రొటేట్ అయినట్లు అనిపిస్తాయి అదొక్కటే మైనస్ మొత్తంగా సినిమా అయితే చాలా బాగుంది అని మహిధర్ తనదైన శైలిలో ధనుష్ సార్ సినిమా రివ్యూ ఇచ్చారు.