Samantha : సమంత పై మనోజ్ బాజ్ పేయ్ కామెంట్స్.. సమంత రీ కౌంటర్

Samantha : బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్ పేయ్ సమంతా పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆయన సమంత గురించి ఏం మాట్లాడారు .. సమంత ఏ విధంగా స్పందించారో ఎప్పుడో చూద్దాం..

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయ్ నటించిన లేటెస్ట్ చిత్రం గుల్మోహర్.. ఈ చిత్రం మార్చి 3న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మనోజ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమంతా గురించి ఈ సందర్భంగా మనోజ్ బాజ్ పేయ్ మాట్లాడుతూ.. సమంతతో కలిసి పనిచేయడం చాలా సులువు తన క్యారెక్టర్ కోసం ఆమె చాలా కష్టపడుతుంటారు. తన హార్డ్ వర్క్ ను నేను చూశాను.

ఫ్యామిలీ మ్యాన్ సెట్స్ లో సమంత శారీరకంగా కూడా విపరీతంగా కష్టపడడం చూశాను .హెవీ వర్కౌట్స్ చేస్తూ తన శరీరాన్ని చాలా కష్టపడేవారు . సమంత వర్క్ చూసి ఒక స్టేజ్ లో నాకే భయమేసింది అంటూ.. తనపై ప్రశంసల వర్షం కురిపించారు. మనోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో సమంత కూడా స్పందించారు.

ఈ సందర్భంగా మనోజ్ బాజ్ పేయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. సమంత ఆయన మాటలకు ఐ విల్ ట్రై సార్ అంటూ ట్వీట్ చేశారు. తన హార్డ్ వర్క్ ను ప్రశంసించినందుకు ఎమోజీలతో ధన్యవాదాలు తెలిపారు. లాక్ డౌన్ లో వచ్చిన ది ఫ్యామిలీ మెంటుతో ఓటీటీ లోకి అడుగు పెట్టారు. సమంత ప్రస్తుతం సిడాటెల్ వెబ్ సిరీస్ కూడా చేయనున్నారు.