Mahesh Babu : మహేష్ బాబు కంటే అందంగా ఉన్న ఘట్టమనేని మేనకోడలు.. గౌతమ్ బాబు కి సూపర్ మ్యాచ్.?

Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ పేరు తెలియని వారు ఉండరు.. ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్న మహేష్ బాబు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.. సాధారణంగా ఘట్టమనేని కుటుంబానికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా మహేష్ బాబు మేనకోడలు మంజుల కూతురు జాహ్నవి ఫోటోలు ఎప్పుడో ఒకసారి కానీ కనిపించవు.. మంజుల జాహ్నవి ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నా.. ఈ పిక్ కు లైక్స్ తో పాటు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి..!!

ఘట్టమనేని మంజుల మహేష్ బాబు సోదరిగా అందరికీ సుపరిచితమే.. మంజుల హీరోయిన్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసిందట కానీ అది కుదరలేదు. కానీ యాక్టింగ్ పై తనకున్న ఇష్టంతో ఈమె ఎన్నో సినిమాలలో నటించింది.. జాహ్నవిని చూస్తుంటే అందరూ అచ్చం హీరోయిన్ లాగా ఉందని.. త్వరలో తెలుగు ఇండస్ట్రీకి ఘట్టమనేని కుటుంబం నుంచి జాహ్నవి హీరోయిన్ గా పరిచయం కావడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. చాలా రోజుల తర్వాత జాహ్నవి ఫోటో మంజుల షేర్ చేసి ఆ పిక్ నెట్ ఇంకా వైరల్ అవుతుంది..

Ghattamaneni's niece who is more beautiful than Mahesh Babu
Ghattamaneni’s niece who is more beautiful than Mahesh Babu

మహేష్ బాబుకు జాహ్నవి అంటే చాలా ఇష్టం. మేనకోడలు, మేనల్లుల్లి కలిస్తే మహేష్ బాబు ఒక్కసారిగా చిన్నపిల్లడిలా మారిపోయి వారితో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు అని.. గతంలో మంజుల తన యూట్యూబ్ ఛానల్ లో తెలియజేశారు.. చూస్తుండగానే జాహ్నవి పెద్దది అయిపోయింది.. జాహ్నవి కూడా మేనమామ మహేష్ లాగా చూడ ముచ్చటగా ఉంది.. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కి మంజుల కూతురు జాహ్నవి సూపర్ జోడి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. సాధారణంగా బావ మరదలు వరస కుదిరితే పెళ్లి అని అనేస్తారు.. మహేష్ మేనకోడలు నిజంగా మహేష్ కి కోడలు అయితే బాగుంటుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. కొంతమంది ఎప్పుడో జరిగే విషయాల గురించి ఇప్పుడు ఎందుకు అంటున్నారు.. బావ మరదల్లేగా పెళ్లి చేసుకుంటే పోలా అని మరికొంతమంది అంటున్నారు..