Guppedanta Manasu 12 oct Episode : వసుధరకు దిష్టి చుక్క పెట్టిన రిషి..! దేవయాని ముందే అలా ఉన్నారా.!?

Guppedanta Manasu 12 oct Episode :  మహీంద్రా నువ్వు రిషి మాటలు కొన్ని విని వుండవచ్చు.. కొన్ని వినకపోవచ్చు.. కానీ తను మాట్లాడిన మాటలలో తన బాధ అర్థమవుతుంది.. జగతి రిషి అన్న మాటలు తలుచుకుని వాళ్ళిద్దరూ గురించి రిసీవ్ ఓపెన్ గా చెప్పాడు. ఆ బంధం కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంది మహేంద్ర అని జగతి అంటుంది కదా అని మహేంద్ర అంటాడు.. ఒకవేళ వసుధారా లేకపోతే అని జగతి అంటుంది..! ఇప్పుడు రిషి ప్రేమని అలాగే తన బంధాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది అని జగతి అంటుంది..

వసుధార ఆటోలో వస్తు రిషి సార్ మెసేజ్ చేయొచ్చు కదా అని అనుకుంటుంది .. పోనీ నేనే చేయనా అని అనుకుంటుంది. వద్దులే ఇప్పుడు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాను గా డైరెక్ట్ గా మాట్లాడతాను అని అంటుంది.. అప్పుడే రిషి థాంక్యూ అని వసుధారకి మెసేజ్ చేస్తాడు.. ఎందుకు సార్ అని రిప్లై ఇస్తూ వాళ్ళ ఇంటి గేటు బయట నుంచి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది.. అప్పుడే రిషి కూడా తనకు ఎదురుగా తనతో మెసేజ్ చేస్తూ ముందుకు నడుస్తాడు.. అనుకోకుండా ఇద్దరూ ఒకరినొకరు ఢీ కొట్టుకుంటారు.. ఒక్క నిమిషం ఆగి వసుధార మళ్లీ తనని ఢీకొడుతుంది.. నువ్వు ఇలాంటివి బాగా నమ్ముతావు అనుకుంటా అని రిషి అంటాడు.. అవును సార్ లేకపోతే కొమ్ములు వస్తాయి అని వసు అంటుంది..

Guppedanta-manasu-12-oct- today full episode
Guppedanta-manasu-12-oct- today full episode

ఆ తర్వాత మళ్లీ రిషి చూసుకోలేదు అని తనని మళ్లీ ఒకసారి తన తలతో డీ కొడతాడు.. సరే అని వసు ఇంట్లోకి వెళ్తుండగా.. హేయ్.. ఆగు.. మన మధ్య ఈ పిక్ అప్, డ్రాప్స్ ఉండకూడదు అంటే.. ఏం చేయాలి అని రిషి అడుగుతాడు.. అయితే నేనైనా మీ దగ్గర ఉండాలి. లేదంటే మీరైనా నా దగ్గర ఉండాలి అని వసుధార అంటుంది.. అందుకు ఏం చేయాలో ఆలోచించి నువ్వే నాకు చెప్పు అని రిషి అంటాడు.. అప్పుడే దేవయాని అక్కడికి వస్తుంది. హలో అని అనుకుంటూ రిషి ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోతాడు.. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది దేవయాని.. జగతి మేడంను పలకరించడానికి వచ్చాను అని వసుధార ఇంట్లోకి వెళ్లిపోతుంది..

ఏంటి అక్కడే నిల్చున్నావు రా అని రిషి అంటాడు.. ఏంటో తెచ్చినట్టు ఉన్నావు అని అంటాడు.. ఏంటి అది అని అడుగుతాడు రిషి.. మీకోసం గిఫ్ట్ తెచ్చాను అని వసుధర అంటుంది.. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన రిషి ఆ బొమ్మలను చూసి బాగున్నాయి అంటాడు.. వీటిని నేనే స్వయంగా ముస్తాబు చేశాను అని అంటుంది.. సార్ ఇప్పుడు ఈ బొమ్మలు మన ఇద్దరికీ ప్రతి రూపం.. ఈ రెండు బొమ్మలు కలిసి ఉన్నట్టే మనం కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి.. ఈ బొమ్మలు నువ్వు తెచ్చి ఇచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది.. సార్ జగతి మేడం కి బొమ్మల కొలువు ఇష్టం.. మీరు పర్మిషన్ ఇస్తే బొమ్మల కొలువు చేద్దాం అని వసు అంటుంది.. మంచి ఐడియా అని రిషి అంటాడు..

సరే వస్తారా బొమ్మలు కావలసిన ఏర్పాట్లు అన్ని నువ్వే దగ్గరుండి చేసుకో అని రిషి అంటాడు సర్ మీరు అసలు ఒప్పుకుంటారు అని నేను అనుకోలేదు అని వసుధార అంటుంది.. నన్ను రాజు అన్నావు.. అప్పుడే రాక్షసుడిని చేసేసావా అని రిషి అంటాడు.. ఒప్పుకోను అని ఆలా ఎలా అంటావు చెప్పు అని రిషి అడుగుతాడు.. అంటే మీరు ప్రిన్స్ అని తెలుసు.. ప్రిన్స్ అంటే యువరాజు కదా సార్.. నాకు ముక్కు మీద కోపం అని ఒప్పుకోను అని అంటావా.. ఈ బొమ్మకు ఏదో తగ్గింది వసుధరా.. ఏం తగ్గింది సార్ అని వసుధరా అడుగుతుంది. రిషి తన చేతిలో ఉన్న బొమ్మ పక్కన పెట్టి వసుధరా దగ్గరకు వచ్చి తన కళ్ళకు ఉన్న కాటుక తీసి.. ఈ రాణికి దిష్టి చుక్క పెడుతున్నాను అని రిషి ఆ బొమ్మకు పెడతాడు.. పసుధారా నిజంగా తనకే దిష్టి చుక్క పడుతున్నాడు అని ఊహించుకుంటుంది.. తన బుగ్గ మీద చేయి వేసుకొని దిష్టి చుక్క నాకు పెట్టలేదా అని మనసులో అనుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది..