Venu Madhav: వేణుమాధవ్ నీ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ స్టార్ కమెడియన్ గుర్తింపు సంపాదించుకున్న వేణుమాధవ్ ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించాడు. కోదాడ నుంచి సాధారణ మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన వేణుమాధవ్ అతికొద్ది సమయంలోనే ఇండస్ట్రీకి వచ్చి మంచి కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కోట్లకు కోట్లకు పైగా ఆస్తిని సంపాదించుకున్నారు.. కానీ ఆయన తల్లి ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది..
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ.. ఈ మాట వాస్తవం. స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వేణుమాధవ్ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే అప్పటికే ఆస్తులు బాగా సంపాదించుకున్న వేణుమాధవ్.. అంతకంటే ఎన్నో రెట్లు మనుషుల మదిలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇటీవల వేణుమాధవ్ తల్లి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. వేణుమాధవ్ తల్లి అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. ఇలా ఆమె అద్దె ఇంట్లో ఉండడం ఏంటి అంటూ కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. నాకు ముగ్గురు మగ పిల్లలు.. వేణుమాధవ్ చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవాడని మిమిక్రీ బాగా చేసేవాడని.. అప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి సినిమాలో అవకాశాలు ఇచ్చారని ఆమె తెలిపింది..
వేణుమాధవ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకున్నారు కానీ నా బిడ్డ అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వేణుమాధవ్ కి చిన్నప్పటినుంచి ఉన్న చెడ్డ అలవాటే ఆయన ప్రాణాలను తీసేసింది. తనకు ఏ అనారోగ్య సమస్య వచ్చిన కానీ మందులు వేసుకునే వాడు కాదు.. అలాగే పెద్దయ్యాక కూడా కొనసాగింది.. అలా వేణుమాధవ్ ఆరోగ్యం పాడైంది. నిజం చెప్పాలంటే వేణుమాధవ్ ఏ అనారోగ్య సమస్య వచ్చినా మందులు వేసుకోకపోవటం వల్లే అతని కొంప ముంచిందని సావిత్రమ్మ తెలిపారు. ప్రస్తుతం వేణుమాధవ్ తల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.