Flora Saini: ఆశ షైనీ సౌత్ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రంలో చేసిన లక్స్ పాప సాంగ్ తనకి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ వెంకీ సీన్స్ లో ఆశా చేసిన అల్లరి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తరువాత ఆశా పలు చిత్రాలలో నటించిన కానీ అంతగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది.
ఆశ షైనీ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అందులో తను ఎంత నరక వేదనను అనుభవించిందో.. ఆ బాధకు కారణం ఎవరో.. ప్రస్తుతం ఆనందంగా ఎంత ఉందో తెలియజేసింది. ప్రముఖ నిర్మాత తనను మోసగించాడని.. 14 నెలల పాటు లైంగికంగా వేధించాడని.. తన ప్రైవేటు భాగాలపై గాయపరచడని.. దారుణంగా హింసించేవాడని తెలిపింది.
ఇక తన నా ఫోన్ కూడా లాక్కొని ఎవరితో మాట్లాడనివ్వకుండా చేసి.. తనని సినిమాలకు దూరంగా ఉండమని.. 14 నెలలు చిత్రహింసలు పెట్టాడని.. కాగా ఒకరోజు ఆ నరకం నుంచి నేను పారిపోయి బయటకు వచ్చాను. ఆ నరకం నుండి నేను కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని ఆశ సైనీ చెప్పారు. ప్రస్తుతం నన్ను ఇష్టపడే వారి మద్దతులో సంతోషంగా తన తల్లిదండ్రుల వద్ద ఉన్నానని.. ఓ వీడియో ను పంచుకున్నారు ఫ్లోరా సైనీ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.