Weight Loss: బరువు పెరగడం సులువే కానీ.. బరువు తగ్గడం మాత్రం చాలా కష్టమని నిదానంగా అర్థమవుతుంది.. ముఖ్యంగా బరువు తగ్గాలన్న ప్రయత్నిస్తున్న వారికి ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు.. వాస్తవానికి వ్యాయామం, డైటింగ్‌లో మార్పుల కారణంగా బరువు తగ్గడం మంచి పరిణామామేకాదు. ఆరోగ్యవంతమైన జీవితానికి అవన్నీ ఉపయోగపడతాయి.. బరువు తగ్గడానికి ఈ సింపుల్ అద్భుతంగా సహాయపడుతుంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతులలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులను తరచూ తీసుకుంటే.. అధిక బరువుతో ఇబ్బందిపడే బాణలాంటి పొట్టకి చెక్ పెట్టవచ్చు..
బాణపొట్టను కరిగించడంలో మెంతులు గ్రేట్ గా పని చేస్తాయి. మెంతులతో తయారు చేసిన ఈ డ్రింక్ పొట్ట తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాణ లాంటి పొట్టను కరిగించే ఈ డ్రింక్ ని ఎలా తయారు చేసుకుని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి…
ముందుగా పొయ్యి పై ఒక గిన్నె పెట్టీ అందులో ఒక కప్పు మెంతులను వేయించి.. వాటిని పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టీస్పూన్ మెంతుల పొడిని కలిపి తాగాలి. అలాగే పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి అర టీ స్పూన్ మెంతి పొడి, ఒక టీస్పూన్స్ తేనె, 3 టీస్పూన్స్ నిమ్మరసం కలిపి తాగాలి. ప్రతి రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే మెటాబాలిజాన్ని వేగవంతం చేసి పొట్ట చుట్టూ కొవ్వును కరిగిస్తుంది. ఎంతటి బాణ పొట్ట అయినా కూడా మెంతులు కరిగిస్తాయి.