Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి , సురేఖ దంపతులు తాజాగా 43వ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీని సుస్మిత, శ్రీజ తో పాటు రామ్ చరణ్ చాలా అట్టహాసంగా జరిపినట్లు.. కూతుర్లు సుస్మిత , శ్రీజ వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలను నెట్టింట షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా పెళ్లి రోజు సందర్భంగా చిరంజీవి తన భార్య సురేఖకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
1980 ఫిబ్రవరి 20వ తేదీన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సురేఖ – చిరంజీవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సురేఖ తమ కుటుంబంలోకి వచ్చిన తర్వాత తమ కుటుంబాలు మారిపోయాయని.. ప్రతి ఒక్కరికి ఆమె ప్రేమను పంచి తనను తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు సురేఖకు తమ కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని చెబుతూ ఉంటారు చిరంజీవి. ఇకపోతే తన భార్యపైన ప్రేమను వ్యక్తపరచడానికి చిరంజీవి ఒక డైమండ్ నెక్లెస్ ను సురేఖకు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ జంటకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Wishing #Chiranjeevi garu #Surekha garu Happy Wedding Anniversary ❤❤@KChiruTweets #SurekhaKonidala
May God Bless You Both Forever 🙏❤#SurekhaAmma #MegaStarChiranjeevi pic.twitter.com/Hrv3ZdeYpc
— Chiranjeevi Army (@chiranjeeviarmy) February 20, 2023