Harsha Vardhan : హర్ష వర్ధన్ బయట పెట్టిన నిజాలు చదవండి. !

Harsha Vardhan : 2014 జూలై 27వ తారీఖు కాన్పూర్ నగరం లో అపర కుబేరుడు ఓం ప్రకాష్ దసాని కి ఒక బిస్కట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆయనకు సమాజంలో మంచి పేరు, సంపన్న వర్గానికి చెందిన కుటుంబం ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న కొడుకు పేరు పీయూష్ దసాని. తల్లిదండ్రులు పీయూష్ దసాని కి జ్యోతిని ఇచ్చి వివాహం చేశారు. వీళ్ల పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు గడిచింది. ఒక రోజు జ్యోతిని తీసుకొని బయటకు వెళ్ళగా.. అక్కడ వారిని గుర్తుతెలియని దుండగులు పియూష్ ని కొట్టి జ్యోతిని హతమార్చారు. అదే విషయాన్ని పియూష్ పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పాడు.. పీయూష్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక టీ షర్టు వేసుకొని కనిపించాడు. ఇక తన భార్యను హాస్పటల్లో పోస్టుమార్టం నిమిత్తం తీసుకువెళ్లగా.. అక్కడికి పియూష్ మరొక టీ షర్టుతో వచ్చాడు. పోలీసులు ఇంతలోనే పియూష్ టీ షర్ట్ మార్చుకొని రావడం వెనకమాల ఏదైనా కారణం ఉందా అని అనుమానించారు. పియూష్ అనుమానం రాకుండా తన కాల్ డేటాను చెక్ చేశారు. దాంతో అనూహ్యమైన నిజాలు బయటకు వచ్చాయి.

పియూష్ మనీషా అనే అమ్మాయితో ప్రేమించాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ పియూష్ ఇంట్లో వాళ్ళు మాత్రం జ్యోతిని ఇచ్చి పెళ్లి చేశారు ఒకవేళ జ్యోతిని పెళ్లి చేసుకోకపోతే తనకి రావాల్సిన ఆస్తి రాదేమో మరి ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు కానీ.. ఇక పీయూష్ కూడా జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. పియూష్ జ్యోతి బయటకు ఏ ఫంక్షన్కు వెళ్లినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వెళ్లి వస్తారు తప్ప. వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తలు గా ఉండవలసిన ప్రేమ , ఆప్యాయత, అనురాగాలు మాత్రం లేవు. ఇక ఇదే విషయాన్ని జ్యోతి కూడా తన డైరీలో రాసుకుందిm ఆ డైరీ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ఒక అమ్మాయి తో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడని.. రాత్రిపూట ఎక్కడికో వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చేవాడిని.. ఎప్పుడూ తనతో ప్రేమగా ఉండేవాడు కాదని జ్యోతి తన డైరీలో రాసుకుంది. పియూష్ మనిషా , పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. జ్యోతి వాళ్లకి అడ్డుగా ఉందని తనని చంపేయాలని అనుకున్నారు. పథకం ప్రకారం పీయూష్ జ్యోతిని లాంగ్ డ్రైవ్ కి తీసుకువెళ్తానని చెబుతాడు.. జ్యోతి అది నిజమేనని నమ్మేసి ఆనందంగా తనతో పాటు బయలుదేరుతుంది.

ఒక రెస్టారెంట్లో ఆగుతారు. ముందుగా రెస్టారెంట్లో వాళ్ల టేబుల్ రిజర్వ్ చేసుకుంటారు. ఆ రెస్టారెంట్లో సుమారు గంటన్నర సేపు పీయూష్ జ్యోతి ఉంటారు. కానీ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుని మాట్లాడుకోరు. ఇక ప్లాన్ ప్రకారం వీళ్ళు కారులో బయలుదేరి కాస్త ముందుకు వెళ్ళగానే నలుగురు బైక్స్ మీద వాళ్ళని ఫాలో అయ్యి పీయూష్ ని కారులో నుంచి బయటకు లాగేసి
. జ్యోతిని కత్తితో పొడిచి పీష్ కళ్ళ ముందుగానే చంపేస్తారు. జ్యోతి శరీరం పైన 17 పైగా కత్తిపోటు గాయాలు ఉంటాయి. జ్యోతిని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎందుకు ఉందని పోలీసులు అనుమానిస్తారు తన భర్త పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక టీ షర్టు పోస్టుమార్టంకి వచ్చినప్పుడు మరొక టీ షర్టులో కనిపిస్తాడు ఏ భర్త అయినా కానీ భార్య మరణిస్తే బట్టలు మార్చుకొని రెడీ అయ్యేంత తీరిగ్గా రాడు కదా అంటే పీయూష్ ఏమైనా దాస్తున్నాడని తనని అనుమానించరు. తన ఫోను చెక్ చేయగా ఒక అమ్మాయి తో మాట్లాడుతున్నారని తెలుసుకుంటాడు. ఇక ప్రియుష్ ను మనీషా లో ఇద్దరినీ వేరువేరుగా ఎంక్వయిరీ చేస్తారు. తర్వాత ఇద్దరినీ పక్కపక్కల కూర్చోబెట్టి ఎంక్వయిరీ చేస్తే అసలు నిజం బయటకు చెబుతారు. దాంతో పోలీసులు ఇద్దరి మీద కేసు ఫైల్ చేస్తారు. ఎనిమిది సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టులో నలిగి.. పియూష్, మనీషా, కారు డ్రైవర్ తో పాటు జ్యోతిని చంపిన మరో ముగ్గురికి యావజీవ కారాగార శిక్షణ విధిస్తారు. దాంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.