Taraka Ratna : నందమూరి తారకరత్న ఆత్మకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహనకృష్ణ చేతుల మీదగా ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. తలకొరివి పెట్టాల్సిన కొడుకు కళ్ళ ముందు చితిమంటల్లో కాలిపోతుంటే ఆ కన్న తండ్రి పడిన వేదన ప్రతి ఒక్క హృదయాన్ని కలిచివేసింది.. తారకరత్న అంత్యక్రియలో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్, పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.. తారకరత్న మరణం పై అనుమానం వ్యక్తం చేస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. తారకరత్న ఎప్పుడో చనిపోయారని.. కానీ ఆ విషయం బయటకు వస్తే లోకేష్ కి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో దాచిపెట్టారని.. ఆమె వేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారి పోతారు . కేవలం తన కొడుకు కోసం వాళ్ళ స్వార్థం కోసం చంద్రబాబు తారకరత్న చావుని ఇన్ని రోజులుగా దాచిపెట్టారు. ఎక్కడ తన కొడుకుకి చెడ్డపేరు వస్తుందనే భయంతో ఇన్ని రోజులు చెప్పలేదు. తారకరత్న ప్రాణం ఎప్పుడో పోయినా ఎన్ని రోజులు బ్రతికి ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయిని చివరికి ఇలా చేశారు..
అసలు ఏంటి ఈ దుర్మార్గం. ఇది చాలా బాధాకరం. మరొక్కసారి చంద్రబాబు ఎంత నీచమైన రాజకీయాలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు.. అని లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలతో తారకరత్న మరణం పై మరోసారి అనుమానం కలుగుతోంది అందరికీ..
జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. కుప్పంలోని వరదరాజ స్వామి ఆలయం వద్ద లోకేష్ పాదయాత్ర తొలి అడుగు పడింది. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొంచెం దూరం నడిచిన తర్వాత తీవ్ర అస్వస్థకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్ళగానే గుండెపోటు వచ్చిందని తెలిసింది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. 23 రోజులపాటు తారకరాత్నకి చికిత్స కొనసాగించగా శనివారం రాత్రి ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.