Brahmanandam : టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ బ్రహ్మానందం.. తన హాస్యంతో తెలుగువారిని ఎంతగానో అలరించారు. అలాగే 67వ పుట్టినరోజు జరుపుకున్నారు దాంతో బ్రహ్మానందం కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో భాగంగా సెర్చ్ చేస్తున్నారు..
తెలుగు లెక్చరర్ గా బ్రహ్మానందం తన కెరియర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఆయన కెరియర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత నుండి బ్రహ్మానందం కామెడీ పాత్రలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో ఏడాది మొత్తం విడుదలైన ప్రతి సినిమాలోని బ్రహ్మానందం కామెడీ ఉండేది. అంతలా ఆయన కామెడీకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు.
ఈ మధ్య సినిమాల్లో కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన స్థాయికి తగిన పాత్రలు పెద్దగా పడటం లేదు. దాంతోపాటు వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి యంగ్ కమీడియన్స్ ఎంట్రీ తో హాస్యబ్రహ్మకి కాస్త అవకాశాలు తగ్గాయని చెప్పాలి. కెరియర్లో సుమారు 1200 పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం ఒక్కో కాల్ షీట్ కి సుమారు లక్ష రూపాయల వరకు రమ్యునరేషన్ ఛార్జ్ చేస్తారు. తన పారితోషకాన్ని సగం భూములపై ఇన్వెస్ట్ చేశారు.
ఇలా ఆయన పొదుపు చేసిన స్థిరా చరస్తులు అన్నీ కలిపితే.. సుమారు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ టాక్ . డబ్బు విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించడంతోపాటు మరే దుర అలవాట్లు లేని బ్రహ్మానందం వందల కోట్ల రూపాయల కు అధిపతి అయ్యాడని చెప్పాలి.. బ్రహ్మానందం తన ఆస్తులకి ఎప్పటికప్పుడు ఇన్కమ్ టాక్స్ ను చెల్లిస్తూనే ఉంటారు.