Suman : హీరో సుమన్ భార్యని ఎప్పుడైనా చూసారా — హీరోయిన్ లు కూడా పనికిరాని అందం ఆమెది..

Suman : టాలీవుడ్ స్టార్ హీరోలలో సుమన్ కూడా ఒకరు ..ఎన్నో హిట్ సినిమాలలో హీరోగా నటించిన అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరు అంటే సుమన్ పేరే ముందుంటుంది. ఆ రోజుల్లో సుమన్ అంటే పడి చచ్చిపోయేవారు లేడీ ఫ్యాన్స్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కలిసి సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే..

Intresting details on hero Suman wife srisha
Intresting details on hero Suman wife srisha

సుమన్ 150 సినిమాల్లో నటించారు. ఒకానొక సమయంలో టాప్ వన్ హీరోగా చిరంజీవితో పాటు పోటీ పడ్డారు సుమన్. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో సుమన్ కెరియర్ పూర్తిగా డల్ అయింది.. అనుకోని పరిస్థితిలో సుమన్ జైలుకి వెళ్లాల్సి వచ్చింద. కొంతకాలం జైలు జీవితం గడిపిన తర్వాత సుమన్ శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

ఈమె ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రైటర్ గా పేరొందిన వివి నరసరాజు అనే రైటర్ మనవరాలు శిరీష.. సుమన్ శిరీష పెళ్లప్పుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. శిరీష హీరోయిన్ మించిన అందంగా ఉంది అని ఆ పిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

శిరీష హౌస్ వైఫ్ అని ఇటీవల సుమన్ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కూతురు ఎమ్మెస్సీ ఫినిష్ చేసిందని భరతనాట్యం కూడా నేర్చుకుందని.. మణిపాల్ యూనివర్సిటీలో తన కూతురు గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. ఇదంతా తన తల్లి ప్రోత్సాహం వల్లనే అని కూడా ఆయన అన్నారు.