Prabhas :మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు.. తాజాగా అచ్చం ప్రభాస్ లాగే ఉన్న ఒక అతని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలని చూసిన కొందరు ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్య పోతున్నారు.. అసలు ఇంతకీ ఈ కట్ ఔట్ ఉన్న వ్యక్తి ఎవరంటు నెట్టింట సెర్చింగ్ చేస్తున్నారు అభిమానులు..
ఇంతకీ ప్రభాస్ లాగా ఇతను ఎవరంటే ఆశిష్ కపూర్. ఈయన బాలీవుడ్ యాక్టర్. పలు సూపర్ హిట్ హిందీ సీరియల్స్ లో నటించాడు. ఇంకా పలు సినిమాల్లో నటించారు. ఒక చిత్రానికి ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసారు. ఆశిష్ కపూర్ సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఈయనకి ఫాన్స్ బేస్ కూడా ఎక్కువే. ఆశిష్ వర్క్ అవుట్ , పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటే అవి వైరల్ అవుతూ ఉంటాయి.. ఇప్పుడు ఆశిష్ ఫోటోలు చూసిన ప్రభాస్ ఫాన్స్ కొన్ని యాంగిల్స్ లో ఆయన ప్రభాస్ లా ఉన్నాడంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ అన్ స్టాపబుల్ షో మొదటి ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరో ఎపిసోడ్ జనవరి 6 విడుదల కానుంది.