Bigg Boss 6 Telugu : హౌస్ లో స్లిప్ అయి పడిపోయిన రేవంత్ .. టీవీలో చూసిన అతని ప్రెగ్నెంట్ భార్య రియాక్షన్ ఇదే . డోంట్ మిస్!

Bigg Boss 6 Telugu : బిగ్బాస్ గేమ్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతుంది. దాన్ని అలా మార్చడానికి నిర్వాహకుల తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఎందుకంటే కంటెస్టెంట్స్ కరెక్ట్‌గా ఆడడం లేదని బిగ్ బాస్‌కు ఇప్పటికే రెండు మూడు సార్లు కోపం వచ్చింది. నాగార్జునకు కూడా మంటెక్కిపోయి మూడు నాలుగు సార్లు అరిచేసాడు. అయినా కూడా వాళ్లలో మార్పు రావడం లేదు. ఇలా ఆడితే ఎలా అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని గేట్లు కూడా ఓపెన్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఆకలి పోరాటం జరిగింది. తిండి కోసం యుద్ధాలు చేయించాడు బిగ్ బాస్. తప్పు చేసిన వాళ్ళ తాట కూడా తీశాడు. అక్కడితో ఆగకుండా ఇంకాస్త డోస్ పెంచాడు. అయితే ఈ ఆటలో భాగంగానే రేవంత్ కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో టీవీలో చూసిన అతని ప్రెగ్నెంట్ భార్య చాలా కంగారు పడిందని తెలుస్తోంది.

తన భర్తకు ఏమైందో అంటూ సన్నిహితులతో చెప్పి బాధ పడిందని ప్రచారం జరుగుతుంది. ఈ వారం అంతా ఇంట్లో బిగ్ బాస్ టాస్కులకు తోడు పనిష్ మెంట్స్ కూడా అలాగే ఉంటున్నాయి. ఇంట్లో అంట్లు తోమడం కాదు.. కాలు కూడా పక్కన బెట్టని గీతూతో గిన్నెల్ని తోమించాడు బిగ్ బాస్. ఆది రెడ్డితోనూ అదే చేయించాడు. ఇదిలా ఉంటే టాస్కులో భాగంగానే రేవంత్ స్టోర్ రూమ్‌కు వెళ్లి కళ్లు తిరిగి కింద పడిపోయాడు. ఆ వీడియో కూడా బాగానే వైరల్ అవుతుంది. ఇంటికి దొంగల్ని పంపించిన బిగ్ బాస్.. ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్లమని చెప్పాడు. దాంతో వాళ్లు రాకముందే.. ఉన్న కాస్త తిండిని ఎగబడి మరీ తినేసారు సభ్యులు. డబ్బాలో అడుగున ఉన్న ఫుడ్‌ను కూడా గీక్కుని తింటూ కనిపించింది గీతూ. తనకు కూడా ఆకలేయడం స్టార్ట్ అవుతోంది బిగ్ బాస్ అని వాసంతి చెబుతుంది. కాసేపటి తర్వాత గార్డెన్‌లో ఫుడ్ పెట్టారు.

Bigg Boss 6 Telugu revanth wife tensed
Bigg Boss 6 Telugu revanth wife tensed

Bigg Boss 6 Telugu : అసలేం జరుగుతుంది ఆ ఇంట్లో..

కానీ దాన్ని పొందడానికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల మధ్య కబడ్డీ పోటీ పెట్టారు. రెండు బృందాలుగా విడిపోయిన ఇంటి సభ్యులు కబడ్డీ ఆడారు. అందులో గెలిచిన వాళ్లకు ఫుడ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే గేమ్ మధ్యలో రేవంత్ కాలు స్లిప్ అయి పడిపోయాడు. ఇదివరకే ఆయన కాలికి గాయం అయిందని గీతూ చెప్పింది. అదిప్పుడు ఇంకా ఎక్కువైందని తెలుస్తుంది. అదే గాయంతో రేవంత్ కనీసం నడవలేకపోతున్నాడని.. కాకపోతే గేమ్ కోసం నొప్పిని ఓర్చుకుని నడుస్తున్నాడని అర్థమవుతుంది. భర్త కాలికి దెబ్బ తగలడం చూసి టీవీ ముందు కూర్చున్న రేవంత్ భార్య చాలా బాధ పడుతుందని తెలుస్తుంది. తనకు ఒక్కసారి భర్తను చూడాలని ఉందని సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో చెప్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈమె కోరికను మన్నించి నాగార్జున ఈ వారం రెస్పాండ్ అవుతాడేమో చూడాలి.