Prabhas Salaar : వామ్మో ఇది అరాచకం.. ప్రభాస్ పుట్టిన రోజు కి సలార్ టీజర్.? వరల్డ్ వైడ్ దద్దరిల్లబోతోన్న యూట్యూబ్.?

Prabhas Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం సలార్.. కేజిఎఫ్ చిత్రాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమా అంటేనే అంచనాలు తారస్థాయిలో నెలకొన్నాయి.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..! ప్రభాస్ పుట్టినరోజుకి తన నటిస్తున్న సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అందరికీ తెలిసిందే.. అయితే సలార్ నుంచి ఊహించని ట్రీట్ ఇవ్వనన్నాడట ప్రశాంత్ నీల్..!! అక్టోబర్ 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే.. ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు అప్పుడే మొదలయ్యాయి..

ఎక్కడ చూసినా ప్రభాస్ పుట్టినరోజు బ్యానర్స్ దర్శనమిస్తున్నాయి.. ప్రభాస్ పుట్టినరోజుకి ఆయన నటించిన వర్షం, బిల్లా చిత్రాలను రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు.. ఈ సినిమాలను 4కే వెర్షన్ లో గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు.. ఇక ఆ సంబరాలలో భాగంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రం నుంచి కూడా కీలక అప్డేట్ రానుందని తెలుస్తోంది.. సలార్ టీజర్ ను విడుదల చేయాలి అని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట.. ఇది భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ టీజర్ ను ఒకేసారి అన్ని భాషలలో డార్లింగ్ పుట్టినరోజున విడుదల చేయాలని అనుకుంటున్నారట..

Prabhas birthday Salaar Teaser update
Prabhas birthday Salaar Teaser update

ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నుంచి విడుదలైన టీజర్ నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాకని.‌ గూగుల్ సెర్చ్ లో టాప్ ట్రెండింగ్ సబ్జెక్టుగా నిలిచింది.. పైగా ఆదిపురుష్ టీజర్ రికార్డుల మీద రికార్డులను సృష్టించింది.. ఆదిపురుష్ సినిమా మీద అంత నెగిటివ్ ఉన్న కూడా పాజిటివ్ రికార్డ్స్ క్రియేట్ చేయగా.. సలార్ సినిమా పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.. అటువంటి సలార్ టీజర్ విడుదల అయితే యూట్యూబ్ లో వరల్డ్ వైడ్ దద్దరిల్లడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.. నిజంగా ఆ రోజు సలార్ టీజర్ విడుదల అయితే ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..