VeerasimhaReddy: నందమూరి బాలకృష్ణ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం వీర సింహారెడ్డి.. ఈ సినిమా జనవరి 12వ తేదీన ఆడియన్స్ కు ముందుకు వచ్చి బాలకృష్ణ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ వసూలు చేసింది.. ఈ సినిమా మొదటి రోజే యాభై కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది .. అలాగే వీర సింహారెడ్డి సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 104 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది..
ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకులకు ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. బాలకృష్ణకి డై హార్ట్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని బాలకృష్ణ ని ఏ రేంజ్ లో చూపిస్తే ప్రతి అభిమానికి గుస్బంస్ వస్తాయో.. ఆ రేంజ్ లో బాలకృష్ణను చూపించారు. బాలకృష్ణ రాయల్ స్క్రీన్ ప్రసెన్స్ ఇంకా అలాగే పైన చెప్పిన డైలాగ్ డెలివరీ కి థియేటర్స్ లో జై బాలయ్య అంటూ నినాదాలు మోగాయి..
మొదటి రోజు బాలయ్య కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ వీర సింహారెడ్డి సినిమా రెండో రోజు కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ అయ్యాయి. కానీ మూడు, నాలుగు రోజుల్లో మళ్లీ దూకుడు చూపించాయి . ఐదో రోజు కూడా కలెక్షన్లలో పుంజుకుంది. లిమిటెడ్ థియేటర్స్ తోనే బాలయ్య ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించాడు. ఓవర్సీస్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసిన వీర సింహ రెడ్డి సినిమా ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వసూలను కలెక్ట్ చేసింది.
బాలయ్య కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు 100 కోట్ల గ్రాస్ మూవీస్ తో సంచలనం సృష్టించాయి.. అఖండ వందకోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. ఆ తరువాత విడుదలైన వీరసింహారెడ్డి సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాలయ్య అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక రోజురోజుకీ బాలయ్య కలెక్షన్ల గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. దాంతో మెగా ఫాన్స్ అంత మిన్న కుండిపోతున్నారు.