Balakrishna: ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి సినిమా.. ఒక రోజు వ్యవధితో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలయ్యాయి ఇక మొదటి రోజే బాలకృష్ణ ఊహించని రేంజ్ లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేశారు.. బాలయ్య కలెక్షన్లతో దుమ్ము దులుపుతున్నారు. అయితే ఇదంతా నిజమా కాదా అని చెక్ చేయడానికి చిరంజీవి తన వర్గాలు వారి చేత వీరసింహారెడ్డి కలెక్షన్స్ తెప్పించుకున్నారట..
ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి వీరసింహారెడ్డికి.. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.35 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 31.05 కోట్ల షేర్ (రూ. 50.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ. 6.15 కోట్లు.,., రూ. 11.05 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. మూడో రోజు రూ. 7.30 కోట్లు.. (రూ. 12.75 కోట్లు గ్రాస్).. నాల్గో రోజు.. రూ. 8.15 కోట్లు.. (రూ. 14.20 కోట్ల గ్రాస్).. ఐదో రోజు రూ. 7.25 కోట్ల షేర్.. రూ. (రూ. 12.50 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఇక ఆరవ రోజు ఏడుకోట్ల షేర్ రాగా 11 కోట్లకు గ్రాస్ వసూలు చేసింది.
బాలయ్య కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు 100 కోట్ల గ్రాస్ మూవీస్ తో సంచలనం సృష్టించాయి.. అఖండ వందకోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. ఆ తరువాత విడుదలైన వీరసింహారెడ్డి సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాలయ్య అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక రోజురోజుకీ బాలయ్య కలెక్షన్ల గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. దాంతో మెగా ఫాన్స్ అంత మిన్న కుండిపోతున్నారు.
వీర సింహా రెడ్డి సినిమా కి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా ఐదో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.25 కోట్లు వసూలు చేసింది. తద్వారా అఖండ 5వ రోజు పేరిట ఉన్న రూ. 3.58 కోట్లు రికార్డును బాలయ్య బ్రేక్ చేశారు. అదేవిధంగా ఐదో రోజు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో ఈ సినిమా చోటు దక్కించుకుంది.