Balakrishna Pavan : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా సీజన్ 2 ని స్టార్ట్ చేశారు.. ఇప్పటికే సీజన్ 2 లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోపాటు మరికొంతమంది రాగా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షో కి వచ్చిన సంగతి తెలిసిందే..
పవన్ కళ్యాణ్ ఒక టాక్ షో కి రావడం ఇదే మొదటి సారి అని చెప్పాలి.. అది అన్ స్టాపబుల్ షో కి సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ కంటెంట్ ని రెండు ఎపిసోడ్స్ గా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది.. అందులో భాగంగా మొదటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో ఫ్యాంట్ మీద ఫ్యాంట్ లు వేసిన విషయంపై ఆసక్తిగా అడిగారు బాలకృష్ణ.
అలాగే త్రివిక్రమ్ తో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది అని అడగగా.. చేయాల్సి వచ్చింది అంటూ.. పవన్ కళ్యాణ్ ఓ ప్రశ్నకి ఇంట్రెస్టింగ్ గా రిప్లై ఇచ్చారు. ఇక రామ్ చరణ్ తో క్లోజ్ ఎందుకయ్యారు అని అడిగితే అవ్వాల్సి వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తరువాత సాయి ధరంతేజ్ కూడా ఈ ఎపిసోడ్ లో కొద్దిసేపు సందడి చేశారు.. అమ్మాయిలు హర్రర్ సినిమాలకి తేడా లేదు అంటూ తేజ్ వేసిన సెటైర్ కి ఫన్ క్రియేట్ అయింది..
ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి పవన్ ఏదో సమాధానం చెప్పారు. అలాగే చిన్న వయసులో మానసిక సంఘర్షణకి గురైన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడు అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. అయితే పవన్ ఆ విషయం గురించి ఇంట్రెస్టింగా సమాధానం చెప్పారు . అన్నయ్య రూమ్ లోకి వెళ్లి పిస్టల్ తీసుకొని అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రోమో కట్ అయింది. ఓ విధంగా చెప్పాలంటే మొదటి ఎపిసోడ్ లోనే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని పవన్ కళ్యాణ్ తో చెప్పించినట్లు తెలుస్తోంది ఈ ప్రోమో యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుని క్రియేట్ చేస్తుంది.