Jr. NTR Taraka Ratna: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని బెంగళూరు నారాయణ హృదయలయ వైద్యులు తెలిపారు. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కార్డియోజెనిక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు శనివారం రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కుప్పం నుంచి బెంగళూరు వచ్చిన నందమూరి బాలకృష్ణ తారకరత్న వెంటే ఉన్నారు..తారకరత్నను చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నేడు ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లారు.
నిన్న టిడిపి అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, సుహాసిని తారకరత్నను చూసి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తారకరత్నను చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నేడు ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.
ఆయన పరిస్థితిపై కుటుంబ సభ్యులు వైద్య బృందాన్ని అడిగి ఎన్టీఆర్ తెలుసుకున్నారు. ఆ పక్కనే ఉన్న బాలకృష్ణను గట్టిగా పట్టుకొని ఏడ్చేశారట జూనియర్ ఎన్టీఆర్.. ఎప్పుడు నవ్వుతూ కనిపించే తారకరత్న హాస్పిటల్ బెడ్ పై క్రిటికల్ పోజిషన్ ఇలాంటి స్థితిలో ఉండడం చూసి జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారట.
తారకరత్నకు గుండెపోటుతో పాటు మరో అరుదైన వ్యాధి కూడా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆయనకు మెలేనా అనే అత్యంత అరుదైన వ్యాధి ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్లే తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం నాడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాతే హెల్త్ బులిటెన్ ను ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం ఉంది.