Dil Raju : దిల్ రాజు నీకు ఇది తగునా.. బలగం సినిమా కథ నాదే.. లబోదిబోమంటున్న జర్నలిస్ట్ గండం సతీష్..

Dil Raju : దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఓ సినిమా కదా కాఫీ కొట్టారని చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమేనని సాక్షాదారాలతో సహా చూపిస్తున్నాడు ఆ కథ రాసుకున్న జర్నలిస్టు గడ్డం సతీష్.. దిల్ రాజు కూడా తన కథని కాపీ కొట్టి కమర్షియల్ హంగులు యాడ్ చేసి, సినిమాగా మార్చేసి డబ్బులు తన జేబులో వేసుకుంటున్నాడని లబోదిబోమంటున్నాడు గడ్డం సతీష్.. అసలు ఈయన కథ ఏంటి.. ఏ సినిమా కథ కాపీ కొట్టాడు.. తనకి ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Balagam movie stroy on journalist gaddam Satish
Balagam movie stroy on journalist gaddam Satish

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా బలగం.. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , జయరాం తదితరలుతో ఈ సినిమా నిన్న మార్చి 3వ తారీఖున థియేటర్స్ లో విడుదల అయింది. ముందుగా ప్రీమియర్ షో చూసిన ప్రముఖ జర్నలిస్టు గడ్డం సతీష్ ఈ బలగం సినిమా కథ నాదేనని మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా.. అసలు నిజాలు బయటపెట్టాడు అతను..

 

ప్రముఖ తెలంగాణ దినపత్రిక నవ తెలంగాణలో పనిచేసే జర్నలిస్టు గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదేనని.. ఈ కథను నేను 2011 డిసెంబర్ 24వ తేదీన నవ తెలంగాణలో పచ్చికి అనే పేరుతో ఆదివారం మ్యాగజైన్ లో రాసానని.. ఇప్పుడు అదే కథ తీసుకుని కొచెం మార్పులు చేర్పులు చేసి.. ఆ కథ కి కమర్షియల్ హంగులు అద్ది బలగం సినిమాగా మార్కెట్ లోకి వదిలి దిల్ రాజు తన జేబులో డబ్బులు వేసుకుంటున్నాడు అని తెలిపాడు.

2011లో రాసిన పచ్చి కి కథను 2014లో నమస్తే తెలంగాణలోని బతుకమ్మలో కూడా ప్రింట్ చేశారని సాక్షాదారాలతో సహా చూపించాడు. పచ్చికి అంటే పక్షికి అని అర్థం. సాధారణంగా మనుషులు చనిపోతే పక్షులకు ఆహారం పెడతారు. మనిషి చనిపోయిన తర్వాత మూడు , ఐదు, ఏడవ రోజుల్లో పక్షికి ముద్ద పెడతారు. పక్షికి పెట్టేదాన్ని పచ్చికి అనే కథగా రాశాను. బలగం అనే పదం కూడా కరెక్ట్ కాదు. బల్గం అనేది సరియైన పదం అని సతీష్ తెలిపారు. ఈ సినిమా కథ నాదేనని అందుకు నిదర్శనమే పచ్చికి కథ అని.. నాకు రావలసిన గుర్తింపు నాకు ఇవ్వాలని గడ్డం సతీష్ తెలిపారు.. తను రాసిన కదని చూపిస్తూ తనకు న్యాయం జరగాలని కోరుతున్నాడు. ఈ సినిమా కథ నాదేనని అందరి ముందు చెప్పాలని గడ్డం సతీష్ కోరుకుంటున్నాడు. ఇక దిల్ రాజు పై రకరకాల కామెంట్స్ లేవనెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇక ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో చూడాలి.