Manchu Manoj.. మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ తాను ప్రేమించిన భూమా మౌనిక రెడ్డిని గత రాత్రి ఘనంగా వివాహం చేసుకున్నారు.. హైదరాబాదు ఫిలింనగర్ లోని తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఆయన నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు. ఈ వేడుకకు దగ్గరి బంధువులు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టీజీ వెంకటేష్, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గల్రాని , కోదండరామిరెడ్డి, దేవినేని అవినాష్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇదిలా వుండగా వీరి పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చినప్పటికీ ఆ వార్తలకు బ్రేక్ ఇస్తూ మంచు మోహన్ బాబు తన భార్యతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే మంచు మనోజ్ గతంలో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చారు. అటు మౌనిక కూడా మొదటి వివాహంతో బ్రేకప్ చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం.