Mahaveerudu: శివ కార్తికేయన్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల..!

Mahaveerudu.. వరుస బ్లాక్ బాస్టర్ విజయాలతో ఊహించని రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటున్న శివ కార్తీకేయన్ తాజాగా ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైలర్ మహావీరుడు సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మహావీరుడు టైటిల్ పోస్టర్ , యాక్షన్ గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ కూడా లభించింది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ “గాన గాన ” పాటని విడుదల చేసి మహావీరుడు మ్యూజికల్ ప్రమోషన్స్ని గ్రాండ్ గా ప్రారంభించారు.

Mahaveerudu': 'Gaana Gaana' is Sivakarthikeyan's energetic dance number -  Telugu News - IndiaGlitz.com

సంగీత దర్శకుడు భరత శంకర్ గానా గానా పాటను మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా కంపోజ్ చేశారు. ఈ పాటలో శివ కార్తికేయన్ చేసిన మాస్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరించాయి. శివ కార్తికేయన్ కు జోడిగా ఈ సినిమాలో అదితి శంకర్ నటిస్తోంది. ఫస్ట్ సింగిల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న మహావీరుడు సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.