JNR NTR : ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. అలాగే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కూడా మారిపోయింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ మంచి సన్నిహితులు.. వారు చేస్తున్న సినిమాల గురించి ముందుగానే చర్చించుకుంటూ ఉంటారు.
కాగా సినిమాలు చేసేటప్పుడు ఈ ప్రొడ్యూసర్ అయినా వారి గురించి మనం తెలుసుకోకుండా సినిమా చేయడానికి ఒప్పుకుంటే.. వారి గురించి ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ వాళ్ళ సన్నిహితులతో చెబుతారు.. అదే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ విషయంలో చేయగా.. ఆ విషయాన్ని సదరు డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తప్పు పట్టారు..
అప్పట్లో నైజంలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ కి వర్షం సినిమాతో మంచి హిట్ పడిన తర్వాత ఆయనతో సినిమా చేయాలని నేను అనుకున్నాను. నేను అప్పటికే నైజంలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాను. నా బ్యానర్ లో సినిమా చేయాలని అడగడానికి వాళ్ళింటికి వెళ్ళాను. ఆయన తండ్రి సూర్యనారాయణ రావు సమక్షంలో సినిమా చేసేందుకు మాట కూడా తీసుకున్నాను. కానీ ఆ రోజు మంచిది కాకపోవడంతో.. అడ్వాన్స్ తర్వాత తీసుకుంటానని ప్రభాస్ చెప్పారు. దాంతో నేను ఇంటికి వచ్చేసాను..
కానీ నేనంటే గిట్టని కొందరు డిస్ట్రిబ్యూటర్లు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రభాస్ కి ఫోన్ చేయించారు. ఆవుల గిరితో సినిమా చేయొద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కు చెప్పారు . దాంతో ప్రభాస్ నాతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కి ఫోన్ చేశారనే విషయం నాకు ఆ తరువాత తెలిసింది. అలా నా బ్యానర్లో ప్రభాస్ సినిమా చేసా అవకాశాన్ని కోల్పోయాను . ఒకవేళ ప్రభాస్ తో కనుక అప్పుడే సినిమా చేసి ఉండుంటే.. నేను ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్ గా ఉండేవాడిని అంటూ ఆవుల గిరి చెప్పుకొచ్చారు. ఇన్ డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళనే నేను ప్రొడ్యూసర్ కాలేకపోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.