Vani Jayaram : వాణి జయరాం తెలుగు, తమిళం తో పాటు పలు భాషల్లో తన గానామృతంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసుని గెలుచుకున్న గొప్ప సింగర్.. ఆమె గాయని అవుతుందని చిన్నప్పుడే జ్యోతిష్యుడు చెప్పారట. కేవలం పది రోజులు చిన్నారిని చూసి ఆయన జాతకం చేయగా అదే నిజమవడం విశేషం..
వాణి జయరాం తన తల్లిదండ్రులకు ఐదవ సంతానం. కాగా తాను పుట్టి పది రోజులే అవుతుందట. ఆ సమయంలో తన తల్లికి జ్వరం వచ్చిందట. ఇంకా తనకు నామకరణం చేయలేదు.. అయితే అప్పుడు ఏం పేరు పెట్టాలనే దానిపై తండ్రి తన పుట్టిన తేదీ సమయం తీసుకొని వెల్లూరులోని ఓ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లారట.
తన పుట్టిన తేదీ వివరాలు చెప్పిన ఆయనకి ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారని.. ఆ విషయాలను వాళ్ళ నాన్న తనతో చెప్పారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు వాణి జయరాం. తన జాతకం చూసి ఈ పిల్ల పెద్దయ్యాక పెద్ద సింగర్ అవుతుందని చెప్పారట. ఆ విషయం విన్న వాళ్ళ నాన్న నవ్వుకున్నారని వాణి అన్నారు.. అంతేకాదు తనకు కలైవాణి అని పేరు కూడా పెట్టమన్నాడట. ఈ విషయం విని తన అమ్మ కూడా నవ్విందట..
కానీ ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు కలై వాణి అదే పేరును నామకరణం చేశారట.. నిజంగా ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లు గొప్ప సింగర్ అయింది వాణి జయరాం.. ఈ విషయం చెప్పిన ఆ జ్యోతిష్కుడు ఆమె ఎప్పుడూ మరణిస్తుందో కూడా కచ్చితంగా ఆ జాతకంలో ముందే చెప్పి ఉంటారని.. అదే ఇప్పుడు జరిగి ఉంటుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.